చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాల్లో ఆ హీరో విలన్‌గా నటిస్తాడా..

టాలీవుడ్ సీనియర్ హీరోలు.. చిరంజీవి, బాలకృష్ణతో పాటు యంగ్ హీరో ఎన్టీఆర్ సహా  అందరి చూపు ఆ బాలీవుడ్ హీరోపైనే ఉంది. 

news18-telugu
Updated: July 29, 2020, 2:49 PM IST
చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాల్లో ఆ హీరో విలన్‌గా నటిస్తాడా..
బాలకృష్ణ,చిరంజీవి,ఎన్టీఆర్ (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్ సీనియర్ హీరోలు.. చిరంజీవి, బాలకృష్ణతో పాటు యంగ్ హీరో ఎన్టీఆర్ సహా  అందరి చూపు ఆ బాలీవుడ్ హీరోపైనే ఉంది.  అంతేెకాదు ఈ ముగ్గురు హీరోలు.. అతన్ని తమ సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో చేయనున్నాడు. ఈ సినిమాను ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్‌ను అనుకుంటున్నారు. ఢిల్లీ రాజకీయల నేపథ్యంలో తెరకెక్కే పాన్ ఇండియా మూవీలో హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రలో బలమైన ప్రతినాయకుడి పాత్రకు అంతే ఇంపార్టెన్స్ ఉంది. అందుకే త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరు సంజయ్‌ దత్‌ను తమ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ మేరకు సంజయ్ దత్‌తో సంప్రదించారు కూడా. ఇప్పటికే సంజయ్ దత్.. యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కే.జీ.ఎఫ్ 2’ సినిమాలో అధిరగా నటిస్తోన్న సంగతి తెలిసిందే కదా.ఈ రోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన మరో లుక్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

అధీరాగా అదిరిపోయిన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ Photo : Twitter


మరోవైపు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో కూడా బలమైన విలన్ పాత్ర ఉందట.  ఆ క్యారెక్టర్ కోసం సంజయ్ దత్‌ను సంప్రదించారట. ఆల్రెడీ ఓ సారి  ఈ సినిమాలో డేట్స్ లేని కారణంగా నటించనని చెప్పిన సంజూ బాబా.. ఇపుడు బాలయ్య సినిమాలో విలన్‌గా యాక్ట్ చేయడానికి  ఒప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు చిరంజీవి కూడా మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో విలన్‌గా వివేక్ ఓబరాయ్ నటించాడు. తెలుగులో అదే పాత్రను చేయడానికి వివేక్ అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదట. అందుకే ఇపుడు వివేక్ ఓబరాయ్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను సంప్రదించారట. సంజయ్ దత్ కూడా ‘లూసీఫర్’ రీమేక్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు సమాచారం. మొత్తంగా టాలీవుడ్ టాప్ హీరోలైనా.. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ ముగ్గురు కూడా తమ సినిమాల్లో బలమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ నటిస్తే బాగుండూ అని కోరుకుంటున్నారు. .మరి వీరి సినిమాల్లో సంజయ్ దత్ నటించేది లేనిది ఆయా చిత్రాలకు సంబంధించిన ప్రముఖులు కానీ డైరెక్ట్‌గా సంజయ్ దత్ స్పందిస్తే కానీ కన్ఫామ్ అని చెప్పలేము.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 29, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading