Home /News /movies /

CHIRANJEEVI AS GOD FATHER SALMAN KHAN WILL JOIN SHOOTING IN JANUARY LAST WEEK HERE ARE THE DETAILS TA

Chiranjeevi As God Father : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ టైమ్ ఫిక్స్..

చిరంజీవి,సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

చిరంజీవి,సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

Chiranjeevi As God Father -  Salman Khan: మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పాల్గొనే డేట్ ఫిక్స్ అయిందట.

ఇంకా చదవండి ...
    Chiranjeevi As God Father -  Salman Khan: మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం కంప్లీటైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఈ నెల నుంచి మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో చిరంజీవ సరసన తమన్నా.. చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ యాక్ట్ చేస్తోంది.  ఇక బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం.  మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ నెక్ట్స్ షెడ్యూల్‌ను ఈ నెలాఖరులో మొదలు కానుంది.

    ఇక ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఓ వారం రోజుల కాల్షీట్స్‌ను సల్మాన్ ఖాన్ అడ్జస్ట్ చేసినట్టు సమాచారం. ఒక వేళ తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్స్‌ విషయంలో ఆంక్షలు విధిస్తే.. మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి.

    NBK - Gautamiputra Satakarni : 5 యేళ్ల బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. టోటల్ కలెక్షన్స్ ఎంతంటే..

    ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, బ్రిట్నీ స్పియర్స్‌తో ఓ స్పెషల్ సాంగ్‌ ఉంది.  మలయాళ ఒరిజినల్ ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ  రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ చేస్తున్నారు.  ఇక  ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్‌తో ఈ రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.

    NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    మరోవైపు ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో మాధవన్  నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో నయనతార యాక్ట్ చేస్తోంది  ఇక ఈ చిత్రంలో   సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి ..  కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని  ఫిబ్రవరి 4వ తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా.. కరోనా నేపథ్యంలోఈ సినిమాను సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేయనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.  ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. మరోవైపు చిరంజీవి.. వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి నటించబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Chiranjeevi, God Father Movie, Mohan Raja, Salman khan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు