Chiranjeevi As God Father - Salman Khan: మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నారా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదిన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది.
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌తో చేయించాలనుకున్నట్టు సమాచారం. ఇక ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు.
ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఈ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచినట్టు సమాచారం. అందుకు చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.
మరోవైపు ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో మల్లూవుడ్ నటుడు బిజూ మీనన్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ నటించడం దాదాపు ఖరారైనట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో మరో మెగా హీరో వరుణ్ తేజ్‌తో పాటు సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..
ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లెలు పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా చిరుకు జోడిగా నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు చిరంజీవి.. బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. దాంతో పాటు పలువురు దర్శకులు చెప్పిన స్టోరీ లైన్‌లకు త్వరలో ఆమోదం తెలపనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Chiranjeevi, God Father Movie, Mohan Raja, Salman khan, Super Good Films, Tollywood