హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Salman Khan: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ ఖరారు.. క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..

Chiranjeevi - Salman Khan: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ ఖరారు.. క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..

చిరంజీవి,సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

చిరంజీవి,సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

Chiranjeevi As God Father -  Salman Khan: మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటించే విషయమై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

Chiranjeevi As God Father -  Salman Khan: మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం కంప్లీటైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఈ నెల నుంచి మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను 30 నుంచి 35 రోజుల్లో కంప్లీట్ చేయనున్నారు. డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేయనున్నారు. జనవరి చివరి కల్ల ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

ఇక ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, బ్రిట్నీ స్పియర్స్‌తో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు చెప్పారు. దీంతో ఈ సినిమాలో నటించే విషయమై క్లారిటీ వచ్చింది. ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ  రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ చేస్తున్నారు.  ఇక  ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు.

Samantha - The Family Man 2 : సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ దూకుడు.. అక్కడ అదరగొట్టిన వెబ్ సిరీస్..


ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. ఫైనల్‌గా  సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఈ రోల్ చేయడానికి ఓకే చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.

NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

మరోవైపు ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో మల్లూవుడ్ నటుడు బిజూ మీనన్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది.ఇక ఈ చిత్రంలో మరో మెగా హీరో వరుణ్ తేజ్‌తో పాటు సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

ఇక చిరంజీవి ..  కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదిన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. తాజాగా విడుదలైన నీలాంబరి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

First published:

Tags: Acharya, Bhola Shankar, Chiranjeevi, God Father Movie, Salman khan, Thaman, Tollywood

ఉత్తమ కథలు