హోమ్ /వార్తలు /సినిమా /

Nani 30: గ్రాండ్‌గా నాని మూవీ ఓపెనింగ్ ప్లాన్స్.. చీఫ్ గెస్ట్ చిరంజీవి!

Nani 30: గ్రాండ్‌గా నాని మూవీ ఓపెనింగ్ ప్లాన్స్.. చీఫ్ గెస్ట్ చిరంజీవి!

Nani 30 Opening (Photo twitter)

Nani 30 Opening (Photo twitter)

Chiranjeevi | Nani: కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నాని కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ఓపెనింగ్ ప్లాన్స్ చేస్తున్న మేకర్స్.. మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్టుగా తీసుకొస్తున్నారట.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు నాచురల్ స్టార్ నాని (Nani). ఇదే బాటలో ఇప్పుడు తన 30 సినిమాను సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. కొత్త దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవ విషయమై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ చిత్ర ఓపెనింగ్‌కి చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతున్న ఈ చిత్రాన్ని నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్ర ఓపెనింగ్ గ్రాండ్ గా ఉండాలని భావించిన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మేనేజ్‌మెంట్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారట. జనవరి 31న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుందని, ఈ ప్రారంభోత్సవ వేడుకలో చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ కానున్నారని సమాచారం.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాని సరసన సీతారమం ఫేం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తండ్రీ కూతుళ్ల బాండింగ్‌పై ఈ సినిమా కథ ఉంటుందని ఇప్పటికే వదిలిన వీడియో గ్లింప్స్ స్పష్టం చేసింది. జనవరి 31న పూజా కార్యక్రమాలతో లంచ్ చేసి.. ఫిబ్రవరి 1 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట మేకర్స్. ఈ చిత్రానికి హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా.. సాను జాన్‌ వర్గీస్‌ ఐఎస్‌సీ కెమెరామెన్ గా పని చేయనున్నారు.

కాగా.. నాని లేటెస్ట్ మూవీ దసరా ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ దసరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్‌ యాక్షన్‌ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాపై నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది.

First published:

Tags: Chiranjeevi, Hero nani, Tollywood