చిరంజీవి, విజయశాంతి కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై..

విజయశాంతి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్. కొన్నాళ్లు రాజకీయాలతో బీజీగా గడిపిన విజయశాంతి.. ఇటీవలే మరోసారి మేకప్ వేసుకున్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 11:19 AM IST
చిరంజీవి, విజయశాంతి కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై..
చిరంజీవి, విజయశాంతి Photo : Twitter
  • Share this:
విజయశాంతి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్. కొన్నాళ్లు రాజకీయాలతో బిజీగా గడిపిన విజయశాంతి.. ఇటీవలే మరోసారి మేకప్ వేసుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.  అది అలా ఉంటే విజయశాంతి, చిరంజీవి జోడి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించింది. ఆ సూపర్ హిట్ జోడి  చాలా ఏళ్ల తర్వాత మరోసారి కలిసి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం పిరియాడిక్ చిత్రం 'సైరా నరసింహ రెడ్డి' చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా తర్వాత ఆయన  కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక రోల్‌‌‌లో విజయశాంతి నటించనున్నారని సమాచారం. చూడాలి మరీ ఈ ప్రచారం ఎంత వరకు నిజం అవనుందో..
Published by: Suresh Rachamalla
First published: August 27, 2019, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading