చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ పై క్లారిటీ.. దర్శకుడు ఎవరంటే..
అవును చిరంజీవి, రామ్ చరణ్..వెండితెరపై ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని మెగాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తొందర్లోనే ఆ కోరిక నెరవేరబోతుంది. ఈ సినిమాను ఎవరు డైరెక్టర్ చేస్తున్నారంటే..
news18-telugu
Updated: October 6, 2019, 3:48 PM IST

చిరంజీవి రామ్ చరణ్ ఫైల్ ఫోటోస్
- News18 Telugu
- Last Updated: October 6, 2019, 3:48 PM IST
అవును చిరంజీవి, రామ్ చరణ్..వెండితెరపై ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని మెగాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తొందర్లోనే ఆ కోరిక నెరవేరబోతుంది. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి..మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ‘బ్రూస్లీ’లో కాసేపు అతిథి పాత్రలో చరణ్ పక్కన కాసేపు కనిపించాడు చిరు. ఇంకోవైపు చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో రామ్ చరణ్.. తండ్రితో కలిసి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలో కాసేపు అలా కనిపించాడు. వీళ్లిద్దరు మూడు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న కంప్లీట్‌గా ఒక సినిమా మాత్రం చేయలేదు. తాజాగా వీళ్లిద్దరు పూర్తిస్థాయిలో ఒక సినిమాలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

తాజాగా రామ్ చరణ్.. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కిన ‘లాసిఫర్’ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. ఇందులో మరో మలయాళీ హీరో పృథ్వీ రాజ్ కీలక పాత్రలో నటించాడు. తండ్రి చిరంజీవి కోసమే రామ్ చరణ్ ఈ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నడని మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి.. పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో రామ్ చరణ్ చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీని ‘సైరా నరసింహారెడ్డి’తో మెగాస్టార్‌కు మంచి సక్సెస్ అందించిన సురేందర్ రెడ్డి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ సినిమా కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాల తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికీ ఈ సారైనా చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించి అభిమానుల కోరిక తీరుస్తారా అనేది చూడాలి.

సైరా సక్సెస్‌తో ఆనందలో చిరంజీవి, రామ్ చరణ్

రామ్ చరణ్, చిరంజీవి తీరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాతల అసహనం..
మహేష్ బాబు AMB థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి..
నిరుద్యోగులకు ఉపాసన కొణిదెల మరో బంపరాఫర్.. ఈ సారి మాత్రం..
పవన్ కళ్యాన్‌తో సినిమా చేయనన్న ఆ నటుడు..
అమెజాన్ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..
అందుకే ఇకపై వాటికి జోలికి పోవడం లేదన్న నాగబాబు..
Loading...