మలయాళ సూపర్ హిట్ రీమేక్‌లో చిరంజీవి, రామ్ చరణ్..

Sye raa | అవును చిరంజీవి, రామ్ చరణ్..వెండితెరపై ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని మెగాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తొందర్లోనే  ఆ కోరిక నెరవేరబోతుంది. వివరాల్లోకి వెళితే.

news18-telugu
Updated: October 1, 2019, 12:48 PM IST
మలయాళ సూపర్ హిట్ రీమేక్‌లో చిరంజీవి, రామ్ చరణ్..
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
అవును చిరంజీవి, రామ్ చరణ్..వెండితెరపై ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని మెగాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తొందర్లోనే  ఆ కోరిక నెరవేరబోతుంది. వివరాల్లోకి వెళితే.. ఇక చిరంజీవి మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’తో పాటు శ్రీనువైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ‘బ్రూస్‌‌లీ’లో  కాసేపు అతిథి పాత్రలో కనిపించాడు. ఇంకోవైపు చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో రామ్ చరణ్.. ఒక పాటలో కాసేపు అలా కనిపించారు. వీళ్లిద్దరు మూడు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న కంప్లీట్‌గా ఒక సినిమా మాత్రం చేయలేదు. తాజాగా వీళ్లిద్దరు పూర్తిస్థాయిలో ఒక సినిమాలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie teaser launch photos in Mumbai సైరా టీజర్ లాంఛ్ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. అమితాబ్, నయనతార మినహా మిగిలిన చిత్రయూనిట్ అంతా వేడుకకు వచ్చారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకతో నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అయిపోయింది సైరా టీజర్. వేడుక అనంతరం ప్రభాస్‌ను కూడా కలిసి మీడియాకు పోజులిచ్చారు చిరంజీవి, రామ్ చరణ్. sye raa,sye raa teaser,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy teaser released,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,ram charan facebook,konidela production company,konidela production company twitter,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,Sye Raa Narasimha Reddy making,chiranjeevi Sye Raa Narasimha Reddy,megastar Sye Raa Narasimha Reddy,sye raa teaser,sye raa making video,Sye Raa Narasimha Reddy cast,Sye Raa Narasimha Reddy crew,nayanthara chiranjeevi,tamannaah Sye Raa Narasimha Reddy,chiranjeevi ram charan,ram charan rrr movie,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,చిరంజీవి సైరా,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
చిరంజీవి, రామ్ చరణ్ సైరా హిందీ టీజర్ లాంఛ్ వేడుకలో (Source: News18 Hindi)


తాజాగా రామ్ చరణ్.. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘లాసిఫర్’ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. ఇందులో మరో మలయాళీ హీరో పృథ్వీ రాజ్ కీలక పాత్రలో నటించాడు. తండ్రి చిరంజీవి కోసమే రామ్ చరణ్ ఈ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నడని మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి.. పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో రామ్ చరణ్ చేయనున్నట్టు సమాచారాం. ఈ సినిమా కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాల తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక  ఈ సినిమా రీమేక్ హక్కులు రామ్ చరణ్ తీసుకోవడంపై నటుడు పృథ్వీరాజ్ ట్వీట్ చేయడం విశేషం. మొత్తానికీ ఈ సారైనా చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించి అభిమానుల కోరిక తీరుస్తారా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 1, 2019, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading