చిరంజీవి, లోకేష్ సహా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సినీ, రాజకీయ ప్రముఖులు..

ఈ రోజు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ రోజు ఎన్టీఆర్ 36 ఏళ్లు కంప్లీట్ చేసుకొని 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ జూనియర్ ఎన్టీఆర్‌‌కు సినీ రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందజేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 20, 2020, 8:59 PM IST
చిరంజీవి, లోకేష్ సహా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సినీ, రాజకీయ ప్రముఖులు..
ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన చిరంజీవి, నారా లోకేష్ (Twitter/Photo)
  • Share this:
ఈ రోజు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ రోజు ఎన్టీఆర్ 36 ఏళ్లు కంప్లీట్ చేసుకొని 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ జూనియర్ ఎన్టీఆర్‌‌కు సినీ రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందజేసారు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్‌కు ఎంతో సన్నిహితుడనే పేరు తెచ్చుకున్న రాజమౌళి ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు విషెస్ అందజేసాడు. అటు ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ తోటి హీరో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. అతనితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంలక్షలు తెలియజేసాడు. అంతేకాదు నువ్వు కన్న కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసాడు.


మరోవైపు ఏపీ మాజీ మంత్రి ఎన్టీఆర్‌ వరసకు బావ అయ్యే లోకేష్ కూడా ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. ఈ యేడాది నీకు శుభం జరుగుకాక అంటూ విషెష్ అందజేసాడు. అటు నారా రోహిత్ నిన్ననే ఎన్టీఆర్‌కు ముందస్తుగా బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.





అటు సమంత కూడా ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.



అటు ఎన్టీఆర్‌ను రామాయణంతో పరిచయం చేసిన గుణశేఖర్ కూడా ఎన్టీఆర్‌కు మా రాముడు.. నందమూరి తారక రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసాడు.



అటు పటాస్‌తో తన తొలిసినిమాకు క్లాప్ కొట్టిన ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అనిల్ రావిపూడి ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు.  అటు దర్శకులు సంపత్ నంది, బాబీ, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌తో పాటు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు సహా పలువురు ప్రముఖులు ఎన్టీఆర్‌కు  బర్త్ డే విషెస్ తెలియజేసారు. అటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం. అంతేకాదు పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ చేసిన డాన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు.















మరోవైపు హైదరాబాద్ గోకుల్ ప్లాట్స్‌ వద్ద లయన్స్ కన్‌స్ట్రక్షన్స్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలకు నందమూరి యశ్వంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చెయ్యాలని ఆకాంక్షించారు. లాక్ డౌన్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అనుక్షణం ప్రజలకు వార్తలు అందించడంలో నిమగ్నమైన జర్నలిస్టులను అభినందించారు.
First published: May 20, 2020, 12:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading