హోమ్ /వార్తలు /సినిమా /

HBD Raghavendra Rao: దర్శకేంద్రుడికి వెల్లువెత్తుతున్న విషెస్.. చిరంజీవి అలా, అనసూయ ఇలా!

HBD Raghavendra Rao: దర్శకేంద్రుడికి వెల్లువెత్తుతున్న విషెస్.. చిరంజీవి అలా, అనసూయ ఇలా!

Photo Twitter

Photo Twitter

నేటితో 80 వసంతంలోకి అడుగుపెడుతున్నారు రాఘవేంద్ర రావు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకుడిగా గొప్ప మర్యాదలతో కీర్తించబడుతున్న ఆయనపై సెలబ్రిటీలు ప్రేమ కురిపిస్తూ గౌరవ పూర్వకంగా బర్త్ డే విష్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

నేడు (మే 23) దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పుట్టినరోజు (Raghavendra Rao Birthday). మే 23, 1942 తేదీన కృష్ణా (Krishna) జిల్లా కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో కోవెలమూడి సుర్యప్రకాశ రావు (Kovelamudi Surya Prakash Rao) దంపతులకు జన్మించిన ఆయన నేటితో 80 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకుడిగా గొప్ప మర్యాదలతో కీర్తించబడుతున్న ఆయనపై సెలబ్రిటీలు ప్రేమ కురిపిస్తూ గౌరవ పూర్వకంగా బర్త్ డే విష్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు దర్శకనిర్మాతలు సహా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మహేష్ బాబు (Mahesh Babu), అనసూయ (Anasuya) లాంటి తారలు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకేంద్రుడుతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.

ఒకానొక సందర్భంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును కలిసి సందర్భం తాలూకు పిక్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన చిరంజీవి.. ''ఎనభై వసంతాల దర్శకేంద్రుడికి జన్మదిన శుభాకాంక్షలు. శత వసంతాలు ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండేలా ఆశీర్వదించమని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను!'' అని పేర్కొన్నారు.

మహేష్ బాబు ట్వీట్స్ చేస్తూ రాఘవేంద్రుడిని మామయ్యా అనేశారు. ''హ్యాపీ బర్త్ డే మామయ్యా.. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ''వెరీ హ్యాపీ బర్త్ డే రాఘవేంద్ర రావు గారు. ఈ సంవత్సరం మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా'' అని వెంకటేష్ విష్ చేశారు. ఈ మేరకు అప్పట్లో రాఘవేంద్రుడితో దిగిన ఓ పిక్ షేర్ చేశారు.

యాంకర్ అనసూయ ట్వీట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే KKR సర్ అని కామెంట్ పెట్టింది. ఈ మేరకు రాఘనవేంద్ర రావు సమర్పణలో తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న వాంటెడ్ పండుగాడు సినిమా పోస్టర్ షేర్ చేస్తూ ప్రమోట్ చేసుకుంది అనసూయ భరద్వాజ్.

ఇకపోతే తన పుట్టినరోజు సందర్భంగా తాను రాసిన బుక్ గురించి అందరికీ వివరంగా చెప్పారు రాఘవేంద్ర రావు. ఆయన తన స్వహస్తాలతో రాసిన పుస్తకం పేరు 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ'. దీని గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు రాఘవేంద్ర రావు. తన సినీ ప్రయాణం తాలూకు జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ ఇందులో పొందుపరిచానని, శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవాన్ని రంగరిస్తూ అన్నీ చెప్పానని పేర్కొన్నారు. ఏదీ కప్పిచెప్పకుండా చాలా ఓపెన్‌గా ఈ పుస్తకం రాశానని, ఇది రానున్న తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

First published:

Tags: Anasuya Bharadwaj, Chiranjeevi, Daggubati venkatesh, K. Raghavendra Rao, Mahesh Babu

ఉత్తమ కథలు