టాలీవుడ్ మెగాస్టార్ ఓ వైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్ చేస్తూ బిజీగా మారారు. తాజాగా ఆయన డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ఓ యాడ్ ఫిల్మ్ చేశారు. అయితే ఈ యాడ్‌కు సంబంధించిన అప్ డేట్స్ గురించి చిరు అభిమానులతో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యాడ్ ఇవాళ విడుదలైంది. అయితే ఇందులో చిరంజీవితో పాటు.. ప్రముఖ నటి ఖుష్బూ, అనసూయ భరద్వాజ్ కూడా కనిపించారు. చిరు పక్కన అనసూయ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీ చిరంజీవితో కలిసి ఓ యాడ్‌ను నిర్మించింది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ యాడ్‌ను తీశారు. అయితే ఇందులో ఒకప్పటి హీరోయిన్, ప్రముఖ నటి ఖుష్బూతో పాటు, బుల్లితెర యాంకర్, నటి అనసూయ కూడా ఉన్నారు. ఖుష్బూ చిరు భార్యగా కనిపిస్తే.. అనసూయ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధిగా ఈ యాడ్‌లో నటించారు. యాడ్‌లో చిరు భార్యకు బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు. అందుకనే ఆమెకు తెలియకుండా అనసూయతో సీక్రెట్‌గా మాట్లాడి ఇల్లు కొంటాడు. అయితే అనసూయతో చిరంజీవి వ్యవహారం అనుమానాస్పదంగా అనిపించడంతో.. వారిద్దరని ఫాలో అవుతోంది ఖుష్బూ. చివరికి భర్త తన పుట్టినరోజున సొంతింటిన కానుకగా ఇస్తున్నాడని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది యాడ్‌లో సీన్స్. అయితే ఈ యాడ్ ఫిల్మ్‌లో చిరంజీవి ఇప్పటివరకు కనిపించని ఫార్మల్ లుక్‌లో కనిపిస్తారు.
అనసూయ నటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చిరు కొత్త సినిమా ఆచార్యలో కూడా అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇపుడు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’లో అనసూయది పవర్‌పుల్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌తో సమానమైన స్క్రీన్ షేరింగ్ ఉంటుందని చెబుతున్నారు. ముందుగా బుల్లితెరపై షోలకు మాత్రమే పరిమితమైన అనసూయ ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కేవలం గ్లామర్ షోకే పరిమితమైంద. అయితే ఆ తర్వాత మాత్రం అనసూయ.. అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ తో పాటు రామ్ చరణ్,సుకుమార్‌ల ‘రంగస్థలం’ మూవీలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన రవితేజ ఖిలాడిలో దాదాపు హీరోయిన్‌తో సమానమైన పాత్రను చేసింది అనసూయ.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.