CHIRANJEEVI ALL SET TO ACT WITH TRISHA IN LUCIFER REMAKER AFTER THE REJECTION OF NAYANTHARA PK
Chiranjeevi Lucifer remake: త్రిష సంచలన నిర్ణయం.. చిరంజీవితో అలాంటి పాత్రలో చెన్నై బ్యూటీ..
చిరంజీవి, మోహన్ రాజా (Twitter/Photo)
Chiranjeevi Lucifer remake: సీనియర్ హీరోలకు కథలు తీసుకురావడం ఈజీగానే ఉన్నా.. వాళ్లకు హీరోయిన్లను ఎంపిక చేయడం మాత్రం ఇప్పుడు చాలా కష్టంగా మారిపోతుంది మన దర్శక నిర్మాతలకు.
సీనియర్ హీరోలకు కథలు తీసుకురావడం ఈజీగానే ఉన్నా.. వాళ్లకు హీరోయిన్లను ఎంపిక చేయడం మాత్రం ఇప్పుడు చాలా కష్టంగా మారిపోతుంది మన దర్శక నిర్మాతలకు. ముఖ్యంగా చిరంజీవి లాంటి 60 ప్లస్ హీరోలకు సరైన జోడీ తీసుకురావడం కోసం మేకర్స్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చిరు ప్రస్తుతం లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్నాడు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. తెలుగులో కూడా చిరంజీవికి హీరోయిన్ లేదనే తెలుస్తుంది. కథను చెడగొట్టకుండా ఉన్నది ఉన్నట్లు కాస్త మార్పులతో చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ఒకటి ఉంటుంది.. అదే హీరో సోదరి పాత్ర. మాతృకలో ఆ పాత్రను ప్రముఖ నటి మంజు వారియర్ చేసింది. ముఖ్యమంత్రి కూతురిగా హుందాగా ఉంటూనే ఎన్నో భావాలను అవలీలగా పలికించారు. తెలుగులో ఆ పాత్ర ఎవరు చేస్తారనే ఆసక్తి చాలా రోజుల నుంచి నడుస్తుంది.
చిరంజీవి,విజయశాంతి (Chiranjeevi Vijayashanti)
సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతిని ఈ పాత్ర కోసం అడిగారు అయితే చిరుకు చెల్లిగా నటించడం ఆమెకు యిష్టం లేక నో చెప్పింది. మరోవైపు నయనతార కూడా ఇదే చేసింది. ఇప్పుడే చెల్లి పాత్రలు చేయడానికి నయనతార సిద్ధంగా లేదు. కథ నచ్చినా కూడా ఆ కారణంతోనే నయన్ లూసిఫర్ రీమేక్‌కు నో చెప్పింది.
చిరంజీవి త్రిష (Chiranjeevi trisha)
ఈ పాత్రను చేసేందుకు త్రిష ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. 16 ఏళ్ల కింద స్టాలిన్ సినిమాలో చిరుకు జోడీగా నటించింది త్రిష. మొన్న ఆచార్యలో కూడా ముందుగా త్రిషను ఎంపిక చేసారు కానీ అనివార్య కారణాలతో ఆమె తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి చెల్లిగా త్రిష కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.