వాల్తేరు వీరియ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఎన్నో మలుపులు తిరిగింది. ఇప్పటికే మూడుసార్లు ఈవెంట్ నిర్వహించే ప్రదేశం మారుతూ వచ్చింది. ఎట్టకేలకు అనేక డ్రామాల నడుమ ఈవెంట నిర్వహించే వేదికకు లైన్ క్లియర్ అయ్యింది. వాల్తేరు వీరయ్య టీం విజ్ఞప్తి మేరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈవెంట్ నిర్వహించుకునేందుకు అనుమతించినట్లు వైజాగ్ సీపీ శ్రీకాంత్ తెలిపారు. ముందుగా జనవరి 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం అనుమతి కోరింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యామ్నాయం చూసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పరిశీలించి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఎట్టకేలకు ఏయూ గ్రౌండ్‌లో ఈవెంట్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
మొదట విశాఖలో ఆర్కేబీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు మార్చారు. మళ్లీ ఆర్కే బీచ్‌కు మార్చారు. ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్ పెడితే క్రౌడ్ ఎక్కువగా వచ్చి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేమని అధికారులు తెలిపారు. బీచ్ కూడా దగ్గరగా ఉండటంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు అక్కడ ఈవెంట్ వద్దన్నారు. చిట్ట చివరికి ఏయూ గ్రౌండ్స్’లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతించారు.
మరోవైపు వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీం జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే... ఇవాళ ..థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. మెగాస్టార్ మార్క్ యాక్షన్ .. కామెడీ .. రొమాన్స్ .. మాస్ స్టెప్పులు .. పవర్ఫుల్ డైలాగ్స్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రధానమైన పాత్రలన్నిటినీ రివీల్ చేస్తూ ఆసక్తిని రేకెత్తించారు. 'మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయనను చూసి' అంటూ సాగే డైలాగ్స్ విని మెగాస్టార్ అభిమానులకు పూనకాలు ఆగడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra university, Megastar Chiranjeevi, Vizag, Waltair Veerayya