Home /News /movies /

CHIRANJEEVI ACHARYA UPDATE SAANA KASTAM LYRICAL VIDEO TO RELEASE ON JANUARY THIRD HERE ARE THE DETAILS SR

Acharya | Chiranjeevi : ఆచార్య నుంచి అదిరిపోయే మాస్ సాంగ్‌.. ముహూర్తం ఫిక్స్...

Saana Kastam Lyrical Video  Photo : Twitter

Saana Kastam Lyrical Video Photo : Twitter

Acharya | Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌లు కలిసి ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య అనే సినిమాలో తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌లు కలిసి ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య అనే సినిమాలో తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్నారు. (Acharya) ఆచార్య ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. ఇక చివరకు ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా ఇప్పటికే ఓ రెండు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా మరోపాటకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. ఓ మాస్ పాటను విడుదల చేస్తున్నట్లు తెలిపింది టీమ్. ఈ చిత్రం నుండి సానా కష్టం అనే లిరికల్ వీడియో సాంగ్‌ను జనవరి 3 వ తేదీన సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

    ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సిద్ధ టీజర్‌ను వదిలింది టీమ్. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఇక మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డేలకు సంబంధించిన నీలాంబరి పాట విడుదలై యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి హల్ చల్ చేస్తోంది.


    ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు అవుతారట. ఇదే టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ తెగ వైరల్‌గా మారింది. దీనికి కారణం ఆర్ ఆర్ ఆర్ కారణంగా చరణ్‌, తారక్‌ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. మరోవైపు ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తోనే ఓ సినిమాను చేయనున్నారు. దీంతో ఎన్టీఆర్ ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్‌కు రావడం పెద్దగా ఆశ్చర్యపడే విషయం కాకపోవచ్చని చర్చ జరుగుతోంది.

    Ajith Valimai Trailer: దూసుకుపోతున్న వాలిమై ట్రైలర్.. 12 గంటల్లో 15 మిలియన్ వ్యూస్..

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aacharya, Chiranjeevi, Ram Charan, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు