Home /News /movies /

CHIRANJEEVI ACHARYA TO RELEASE FOR CHRISTMAS HERE ARE THE DETAILS SR

Chiranjeevi : చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ సమయం రానే వచ్చింది...

చిరంజీవి (File/Photo)

చిరంజీవి (File/Photo)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న చిత్రం ఆచార్య. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా విడుదల విషయంలో దర్శక నిర్మాతలు ఓ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మిస్టరీ గానే మిగిలిపోయింది. అనేక కథనాల నడుమ ఈ సినిమా విషయంలో కాస్తా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం మేరక ఆచార్య క్రిస్మస్ రేస్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇక ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.

    Love Story : లవ్ స్టోరి ఏడు రోజుల కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..

    ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

    Kondapolam : సెన్సార్ పూర్తి చేసుకున్న వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ కొండ పొలం..

    ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aacharya, Chiranjeevi, Tollywood news

    తదుపరి వార్తలు