• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • CHIRANJEEVI ACHARYA RELEASE POSTPONED DUE TO THIS REASON HERE ARE THE DETAILS SR

Chiranjeevi Acharya : ఆచార్య విడుదల వాయిదా.. కొత్త విడుదల తేది అదేనా..

Chiranjeevi Acharya : ఆచార్య విడుదల వాయిదా.. కొత్త విడుదల తేది అదేనా..

Chiranjeevi Ram Charan in Acharya Photo : Twitter

Chiranjeevi Acharya : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మే 13న విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. అయితే తాజాగా వస్తోన్నసమాచార మేరకు ఈ సినిమా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఆచార్య కూడా వాయిదా పడిపోయిందని టాక్‌. దీనికి తోడు కొంత షూటింగ్ చేయాల్సి ఉందట. గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి అవ్వకపోవడంతో ఈ సినిమా మే 13న రావడం కష్టమే అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా చిత్రబృందం మరో డేట్ ని కూడా అట్టి పెట్టుకుంది. అన్ని అనుకూలిస్తూ ఆచార్య జూన్ 18 న విడుదలకానుందని తాజా సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల చేయనుంది చిత్రబృదం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఓ ముప్పై నిమిషాల వరకు ఉంటుందని టాక్. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ‌లో కూడా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

    ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రికరణ జరుపుకుంటోంది. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదలకానుంది. ఇక ఆచార్య విషయానికి వస్తే.. ఈ సినిమాలో మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారని తెలిసిందే. అయితే ఆ పాత్రలో ఆయన కేవలం పది నిముషాలు మాత్రమే కనిపిస్తారట. ప్లాష్ బ్యాక్ వచ్చే కొన్ని సీన్స్ లో మాత్రమే అలా కనిపిస్తారట చిరంజీవి.


    ఈరోజు ఉగాది సందర్భంగా చిరంజీవి తన ఫాలోవర్స్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక ఆచార్య విషయానికి వస్తే.. ఈ  సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి లూసిఫర్ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి కనిపించనున్నాడు. ఈ సినిమాను తెలుగులో మోహన్ రాజా దర్శకతం వహించనున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన వేదాళం అనే తమిళ సినిమాను తెలుగులో చేయనున్నాడు. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు.
    Published by:Suresh Rachamalla
    First published: