• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • CHIRANJEEVI ACHARYA MOVIE PRODUCERS RAM CHARAN NIRANJAN REDDY COTED HUGE AMOUNT FOR NIZAM HERE THE DETAILS PK

Acharya Nizam rights: ‘ఆచార్య’ నైజాం రైట్స్ అంత కోట్ చేసారా.. మెగాస్టారా మజాకా..?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య (Chiranjeevi Acharya)

Acharya Nizam rights: చిరంజీవికి నైజాం అంటే పెట్టని కోట. మొదట్నుంచీ కూడా ఈయన సినిమాలు ఇక్కడ రికార్డులు తిరగరాస్తుంటాయి. చిరు సినిమా వచ్చిందంటే చాలు నైజాంలో కాసుల పంట పండుతుంది. ఇప్పుడు 10 కోట్లు వస్తే పండగ చేసుకుంటున్నారు హీరోలు.

  • Share this:
చిరంజీవికి నైజాం అంటే పెట్టని కోట. మొదట్నుంచీ కూడా ఈయన సినిమాలు ఇక్కడ రికార్డులు తిరగరాస్తుంటాయి. చిరు సినిమా వచ్చిందంటే చాలు నైజాంలో కాసుల పంట పండుతుంది. ఇప్పుడు 10 కోట్లు వస్తే పండగ చేసుకుంటున్నారు హీరోలు. అలాంటిది మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లకముందే నైజాంలో ఈయన సినిమాలు 10 కోట్లు వసూలు చేసాయి. అంతటి చరిత్ర ఈయన సొంతం. ఇప్పుడు నైజాం మార్కెట్ మరింత పెరిగిపోయింది. దాంతో స్టార్ హీరోల సినిమాలకు దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు కూడా వసూళ్లు వస్తున్నాయి. దాంతో రైట్స్ కూడా అదే స్థాయిలో పలుకుతున్నాయి. ఇప్పుడు చిరంజీవి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. తాజాగా చిరు నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీని బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. అపజయం అంటూ ఎరుగని కొరటాల శివ దర్శకుడు కావడంతో అన్నిచోట్లా కూడా ఆచార్య బిజినెస్‌కు రెక్కలొస్తున్నాయి. ముఖ్యంగా నైజాంలో కూడా పిచ్చెక్కిస్తుంది ఈ చిత్రం. ఇక్కడ చిరంజీవి సినిమాలకు ఎలాంటి మార్కెట్ ఉందనేది ఖైదీ నెం 150, సైరా సినిమాలు నిరూపించాయి. ఈ రెండు సినిమాలు కూడా 25, 30 కోట్లు వసూలు చేసాయి. దాంతో ఆచార్యకు కూడా అదే స్థాయిలో కోట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
acharya movie,chiranjeevi acharya movie,acharya movie rights,acharya movie nizam rights 35 crore,acharya movie pre release business,chiranjeevi acharya movie,acharya movie teaser reactions,telugu cinema,ఆచార్య,ఆచార్య సినిమా టీజర్,ఆచార్య నైజాం రైట్స్,ఆచార్య నైజాం రైట్స్ 35 కోట్లు
‘ఆచార్య’ (Twitter/Photo)

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌లో ఆచార్య వస్తుంది. మే 13న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పట్నుంచే మొదలైపోయింది. మొన్న విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే కాస్త యాక్షన్ ఎక్కువైపోయిందనే వార్తలు అయితే వచ్చాయి. ఇదిలా ఉంటే కేవలం నైజాం కోసమే 35 కోట్ల వరకు నిర్మాతలు కోట్ చేసినట్లు తెలుస్తుంది.
acharya movie,chiranjeevi acharya movie,acharya movie rights,acharya movie nizam rights 35 crore,acharya movie pre release business,chiranjeevi acharya movie,acharya movie teaser reactions,telugu cinema,ఆచార్య,ఆచార్య సినిమా టీజర్,ఆచార్య నైజాం రైట్స్,ఆచార్య నైజాం రైట్స్ 35 కోట్లు
ఆచార్య టీజర్ (Acharya teaser)

ఇంత మొత్తం అంటే చిన్న విషయం కాదు. కానీ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా 35 కోట్లు రావడం పెద్ద కష్టమేం కాదు. అందుకే నిర్మాతలు ఈ స్థాయిలో కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 35 కోట్లు అంటే కనీసం 30 కోట్ల వరకు రైట్స్ అమ్ముడతాయనేది నిర్మాతల ఆలోచనగా కనిపిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. ఏదేమైనా కూడా ఆచార్య నైజాం రైట్స్ మాత్రం ఇంత పలికితే మెగాస్టార్ కొత్త రికార్డులకు తెర తీసినట్లే.
Published by:Praveen Kumar Vadla
First published: