హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్.. ఆచార్య మూవీపై భయంకరమైన ట్రోల్స్..

Acharya: మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్.. ఆచార్య మూవీపై భయంకరమైన ట్రోల్స్..

ఆచార్య పోస్టర్

ఆచార్య పోస్టర్

Acharya: అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఐతే రివ్యూలను, సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోకుండా.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య మూవీ (Acharya Movie) ఫీవర్ పట్టుకుంది. ఏ థియేటర్ వద్ద చూసినా మెగా అభిమానుల సందడే కనిపిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల తర్వాత చిరు సినిమా రావడం.. అది కూడా అనేక వాయిదాల అనంతరం విడుదల కావడంతో.. ఆచార్య సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan Tej) కలిసి నటించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తెరపై తండ్రీకొడుకులను చూసి మురిసిపోతున్నారు. చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్, హిట్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ఆచార్య మూవీ.. రికార్డులు తిరగరాస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఆ స్థాయిలో సినిమా లేదని చాలా మంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొరటాల నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదని ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరైతే బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని.. రాజమౌళి సినిమా తర్వాత రామ్‌చరణ్‌కు ఫ్లాప్ రాక ఇంకే వస్తుందని.. ఐరన్ లెగ్ పూజా హెగ్డే (Pooja Hegde) ఉంటే.. మూవీ ఆడదని.. ఇలా ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. అందులో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

మరికొందరు మాత్రం రివ్యూలను పక్కనబెట్టి.. తెరపై చిరు,చరణ్‌ల మ్యాజిక్‌ను చూడాలని కోరుతున్నారు. మళ్లీ ఇలాంటి కాంబినేషన్ రాదని.. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా ఆచార్యను ఆస్వాదించాలని సూచిస్తున్నారు.

ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలయింది. 132.50 కోట్ల టార్గెట్‌తో ఆచార్య బరిలో దిగింది. అంతేకాదు విడుదలకు ముందు ఎన్నో సంచనాలు సృష్టించింది. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ రికార్డును ఆచార్య క్రియేట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఐతే అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అదేం లేదని.. సినిమాను అద్భుతంగా ఉందని..రివ్యూలను పట్టించుకోకుండా.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని.. ఖచ్చితంగా నచ్చుతుందని.. మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Acharya, Acharya movie, Chiranjeevi, Ram Charan, Ramcharan, Tollywood

ఉత్తమ కథలు