Chiranjeevi | Venkatesh : క్లాష్ ఆఫ్ ది టైటాన్స్.. రిలీజ్ విషయంలో పోటీ పడుతున్న చిరంజీవి వెంకటేష్..

చిరంజీవి వెంకటేష్‌ల మధ్య పోటీ తప్పదా.. Photo : Twitter

Venkatesh Naarappa : వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

 • Share this:
  వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఆ పోస్టర్స్‌లో వెంకటేష్ ఇంటెన్స్ లుక్‌తో ఇరగదీశాడు. కాగా ఈ సినిమా తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించింది. ఈ సినిమా అక్కడ దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తోండగా ఆయనకు జంటగా ప్రియమణి నటిస్తోంది. తమిళ్‌లో ఈ సినిమా హత్తుకునే భావోద్వేగాలతో గ్రామీణ నేపథ్యంలో సాగుతూ హృదయాలను కట్టిపడేసింది. తెలుగులో కూడా ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా రూపొందించాలని భావించిన దర్శక నిర్మాతలు సినిమాకు సంబందించి కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నారు. వేసవిలో విడుదలకానున్న నారప్ప మూవీ షూటింగ్ పార్ట్‌ని కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని హీరో వెంకటేష్ ఓ ట్వీట్ ద్వారా తెలియజేయశాడు. ఈ సినిమా వేసవికానుకగా మే 14న రిలీజ్ కాబోతోంది.

  అయితే ఇక్కడే ఓ చిక్కోచ్చిపడింది. నారప్ప సినిమాకు ఒక్కరోజు ముందు అంటే మే 13న మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆచార్య’ విడుదలను ప్రకటించింది చిత్రబృందం.


  ఈ రెండు సినిమాల తేదీలను కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకటించారు చిత్రదర్శకనిర్మాతలు. వెంకటేష్ నారప్ప, చిరంజీవి ఆచార్య రెండూ పెద్ద సినిమాలే కాబట్టి కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ అంటే బాక్సాఫీస్ దగ్గర కొంత ప్రాబ్లెమ్ అయ్యే అవకాశం ఉంది.


  ముఖ్యంగా విడుదలయ్యే థియేటర్ల కౌంట్ కూడ బాగా తగ్గిపోతుంది. ఏ సినిమాకూ అధిక సంఖ్యలో స్క్రీన్లు దొరికే అవకాశం ఉండదు. దీంతో ఓపెనింగ్స్ కూడా దెబ్బపడుతుంది. ఇది రెండు సినిమాలకూ నష్టమే. పరిశ్రమకు మంచిదికాదు. అందుకే ఈ పోటీని తప్పించడానికి వెంకీయే ముందుడుగు వేసేలా కనిపిస్తున్నారు. తన సినిమా విడుదల తేదిని మార్చనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి నారప్ప కొత్త విడుదల తేది ఎప్పడు ఉండనుందో... ఇక ఏప్రిల్ 30న రానా ‘విరాటపర్వం’ వస్తోంది. దీని తర్వాత మే 10వ తేదీ వరకు ఎలాంటి పెద్ద సినిమాలూ లేవు. అదే విధంగా చిరంజీవి ‘ఆచార్య’ మే 13 తర్వాత చూసుకుంటే మే 28న ‘ఖిలాడి’ వస్తుంది. అంటే చిరు సినిమాకు, రవితేజ సినిమాకు 13 రోజుల పైనే గ్యాప్ ఉంది. ఈ మధ్యలో బహుశా నారప్ప విడుదలయ్యే అవకాశం ఉంది.

  ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌ గాంధీ నడికుడికర్‌, కథ  వెట్రిమారన్‌, ఫైట్స్‌ పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం రాస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: