HOME »NEWS »MOVIE »chiranjeevi aacharya release date mhn

Chiranjeevi Aacharya Release Date: థియేట‌ర్స్‌లో మెగాస్టార్ ‘ఆచార్య‌’ సంద‌డి ఎప్పుడో తెలుసా?

Chiranjeevi Aacharya Release Date: థియేట‌ర్స్‌లో మెగాస్టార్ ‘ఆచార్య‌’ సంద‌డి ఎప్పుడో తెలుసా?
‘ఆచార్య’ షూటింగ్‌లో తిరిగి జాయిన్ అయిన చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi - Aacharya Release Date: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆచార్య’ విడుదల తేదీపై నిర్మాతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ‘ఆచార్య’ సినిమాతో ఈ ఏడాది సంద‌డి చేయాల‌ని మెగాస్టార్ చిరంజీవి అనుకుంటే.. కోవిడ్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయింది. రీసెంట్‌గానే సినిమా షూటింగ్‌ను పునః ప్రారంభించారు. సోనూసూద్‌, ఇత‌ర న‌టీన‌టుల మీద కీల‌క స‌న్నివేశాల‌ను కొర‌టాల శివ తెర‌కెక్కించారు. చిరంజీవి సెట్స్‌లో జ‌న‌వ‌రిలో జాయిన్ అవుతార‌ని వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. కానీ ఇన్‌సైడ్ సినీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. చిరంజీవి ఇప్ప‌టికే సెట్స్‌లో జాయిన్ అయ్యార‌ట‌. క్లైమాక్స్ స‌న్నివేశాలు, ఓ భారీ యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌రించార‌ని స‌మాచారం. ఇక సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న రామ్‌చ‌ర‌ణ్ జ‌న‌వ‌రి నుండి షూటింగ్‌లో పాల్గొంటాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

    మార్చి నెల నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అనుకుంటున్నారు. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఒక‌వైపు పూర్తి చేసుకుంటూ వ‌చ్చేలా ప్లాన్ అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 7న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. దేవాదాయ శాఖ‌లోని అవినీతిని ప్ర‌శ్నించేలా సినిమా ఉంటుంద‌ని ఇందులో చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్ర‌లో క‌నిపిస్తే.. రామ్‌చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ న‌క్స‌లైట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టించే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక చిరంజీవి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. రీసెంట్‌గానే పెళ్లి చేసుకుని హ‌నీమూన్ మూడ్‌లో ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లోనే ఆచార్య సెట్స్‌లో జాయిన్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు ప‌ద‌హారు ఎక‌రాల స్థ‌లంలో 20 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఓ విలేజ్ సెట్‌ను వేశారు. ఇందులోనే మేజ‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.



    స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత‌గాథ `సైరా న‌ర‌సింహా రెడ్డి` వంటి ప్యాన్ ఇండియా చిత్రంతో గ‌త ఏడాది చిరంజీవి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాడు. కాగా.. ‘ఆచార్య’ సినిమా రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. మెగాభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాను మంచి మెసేజ్‌తో మిక్స్ చేసి సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన కొర‌టాల శివ.. త‌న‌దైన స్టైల్లో మ‌రోసారి ‘ఆచార్య‌’తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి రెడీ అవుతున్నాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించడానికి రెడీ కావాలి. మరో వైపు తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది మాత్రం చిరంజీవి రెండు సినిమాలతో అభిమానులను అలరించడం ఖాయమని అంటున్నారందరూ.
    Published by:Anil
    First published:December 14, 2020, 23:09 IST