బ‌య‌ట ఇంకా నిర్మాత‌లున్నారు చిరంజీవి గారూ..!

చిరంజీవితో సినిమాలు నిర్మించాలనుకుంటున్న నిర్మాతలకు మళ్లీ మళ్లీ మొండిచేయి ఇస్తున్నాడు మెగాస్టార్. ఇప్పుడు ఈయన తీరు చూస్తుంటే ఎవరికీ అందేలా కనిపించడం లేదు. తాను.. తన సొంత సంస్థ అంటూ దూసుకుపోతున్నాడు. ఇదే ఇప్పుడు కొందరు నిర్మాతలకు కంగారు పుట్టిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2018, 9:45 PM IST
బ‌య‌ట ఇంకా నిర్మాత‌లున్నారు చిరంజీవి గారూ..!
చిరంజీవి
  • Share this:
ఇప్పుడు ఈయ‌న తీరు చూసి నిర్మాత‌లు కూడా ఇదే అంటున్నారేమో..? ఎందుకంటే ప‌దేళ్లుగా చిరంజీవి ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడా..? ఎప్పుడెప్పుడు ఆయ‌న‌తో సినిమాలు చేద్దామా అని వేచి చూస్తున్నారు నిర్మాత‌లు. ద‌ర్శ‌కుల గురించి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. కుర్ర ద‌ర్శ‌కులు కూడా ఆయ‌న కోసం క‌థ‌లు సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయ‌న మాత్రం చాలా తెలివిగా న‌డుచుకుంటున్నారు.

బ‌య‌ట ఇంకా నిర్మాత‌లున్నారు చిరంజీవి గారూ..! chiranjeevi 152nd movie in konidela productions and matinee entertainments
చిరంజీవి ఖైదీ నెం.150


రీ ఎంట్రీ సినిమాకు ఉన్న డిమాండ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అప్ప‌టిక‌ప్పుడు కొడుకును నిర్మాత‌ని చేసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ స్థాపించాడు మెగాస్టార్. "ఖైదీ నెం.150" సినిమాకు కోట్ల‌కు కోట్ల లాభాలు అందుకున్నాడు చ‌ర‌ణ్. ఈ సినిమా 104 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.. ఇంకా డ‌బ్బింగ్, డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్ అద‌నం. స‌రేలే.. 150వ సినిమా క‌దా ఆ మాత్రం ఆత్రం ఉంటుందిలే అనుకున్నారు కానీ 151వ సినిమా కూడా త‌న‌యుడికే ఇచ్చాడు చిరంజీవి. "సైరా" షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్త‌యింది.. జార్జియా షెడ్యూల్‌తో బిజీగా ఉంది ఈ చిత్రం.

బ‌య‌ట ఇంకా నిర్మాత‌లున్నారు చిరంజీవి గారూ..! chiranjeevi 152nd movie in konidela productions and matinee entertainments
చిరంజీవి సైరా పోస్టర్


200 కోట్లు క‌దా.. బ‌య‌టి నిర్మాత‌లు బాగా తీస్తారో లేదో.. పైగా అది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ క‌దా అందుకే మ‌ళ్లీ సొంత బ్యాన‌ర్ లో చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు 152వ సినిమా కూడా మ‌ళ్లీ కొణిదెల సంస్థ‌లోనే చేస్తున్నాడు మెగాస్టార్. ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశం. అస‌లు బ‌య‌ట నిర్మాత‌లు ఎంతోమంది వేచి చూస్తున్నారు.. అల్లు అర‌వింద్, అశ్వినీద‌త్ లాంటి మెగా ప్రొడ్యూస‌ర్స్ కూడా మెగా డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ వ‌ర‌స‌గా మూడో సినిమా కూడా కొడుకు నిర్మాణంలోనే చేస్తున్నాడు చిరంజీవి.

బ‌య‌ట ఇంకా నిర్మాత‌లున్నారు చిరంజీవి గారూ..! chiranjeevi 152nd movie in konidela productions and matinee entertainments
చిరంజీవి కొరటాల శివ


కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌లు క‌లిపి ఈ చిత్రం నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. మొత్తానికి త‌న‌తో సినిమాలు చేయాల‌నుకుంటున్న నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తూ వ‌ర‌స‌గా కొడుకు నిర్మాణంలో సినిమాలు చేస్తూ లాభాలు కుమ్మేస్తున్నాడు మెగాస్టార్. మ‌రి ఈ ట్రెండుకు ఆయ‌న ఎప్పుడు చెక్ పెడ‌తాడో ఏంటో..?
Published by: Praveen Kumar Vadla
First published: October 10, 2018, 9:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading