‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొరటాల శివ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్‌తో తెరకెక్కించబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీటైన ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు దాదాపు 80 పనిదినాల్లో ఈ సినిమాను కంప్లీట్ చేసిన ఏప్రిల్ చివరి వారలంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈసినిమా షూటింగ్‌ను పాటతో మొదలు పెట్టనున్నట్టు సమాచారం. అసలు చిరు సినిమా అంటేనే పాటలు,డాన్సులు గట్రా ఉండాల్సిందే. రీసెంట్‌గా రిలీజైన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరుకు డాన్సు చేసే అవకాశం లేకుండా పోయింది. అందుకే కొరటాల శివ సినిమాతో ఆ లోటును భర్తీ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో డాన్సులతో అభిమానులను అలరించేలా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Koratala siva, Ram Charan, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood