‘క‌బీర్ సింగ్’ కాంట్ర‌వ‌ర్సీ ముదురుతుంది.. చిన్మ‌యిపై పెరుగుతున్న ట్రోల్స్..

విడుద‌లైన రెండేళ్ళ త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయాడు అర్జున్ రెడ్డి. అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో కూడా దున్నేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 8, 2019, 3:24 PM IST
‘క‌బీర్ సింగ్’ కాంట్ర‌వ‌ర్సీ ముదురుతుంది.. చిన్మ‌యిపై పెరుగుతున్న ట్రోల్స్..
చిన్మయి శ్రీపాద సందీప్ రెడ్డి వంగా
  • Share this:
విడుద‌లైన రెండేళ్ళ త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయాడు అర్జున్ రెడ్డి. అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో కూడా దున్నేస్తుంది. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు మ‌హిళా లోకానికి కోపం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అబ్బాయి అమ్మాయిని కొట్ట‌డం త‌ప్పు కాదు.. అది వాళ్ల మ‌ధ్య స్వేచ్ఛ‌కు చిహ్నం అంటూ ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ప్రేమ ఉంటే కొట్టుకుంటారా.. కొడితేనే ప్రేమ ఉన్న‌ట్లా అంటూ ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడిపై విమ‌ర్శనాస్త్రాలు సిద్ధం చేస్తున్నారు కొంద‌రు సెల‌బ్రిటీస్.

ముఖ్యంగా అందులో చిన్మయి కూడా ఉంది. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ క్రిటిక్స్ రాసిన తీరును కూడా త‌ప్పుబట్టాడు సందీప్. అస‌లు సినిమాలు చూడ‌టం రానివాళ్లు కూడా రివ్యూలు రాస్తున్నారంటూ రెచ్చిపోయాడు. అక్క‌డితో ఆగ‌కుండా సినిమాలో హీరోయిన్‌ను కొట్టే సీన్ గురించి వివ‌రించాడు. ప్రేమలో ఉన్న ఇద్దరికి ఒకరినొకరు టచ్ చేసుకునే చనువు కానీ.. వాళ్ల‌ను కొట్టే స్వేచ్ఛ కానీ ఉంటాయి.. అలా ఉండాల్సిందే.. అదే లేక‌పోతే ఇంక అది నిజ‌మైన ప్రేమ ఎలా అవుతుందంటూ ప్ర‌శ్నించాడు ఈయ‌న‌.దీనికి ఇప్పుడు చిన్మ‌యి కూడా ఓ రేంజ్‌లో స‌మాధానం ఇచ్చింది. ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన వీడియో ట్విట్ట‌ర్లో పోస్ట్ చేస్తూ డీప్లీ డిస‌ప్పాయింటింగ్ అంటూ రాసుకొచ్చింది. అక్క‌డితో ఆగ‌కుండా ఏంటి.. ప్రేమలో ఉంటే ఒకరినొకరు కొట్టుకోవాలా.. అయితే తాను త‌న భ‌ర్త ప్రేమ‌లో ఉన్నాం.. మ‌రి అలాంట‌ప్పుడు త‌ను ఎప్పుడూ న‌న్ను కొట్ట‌లేదే.. ఒక‌రిని ఒక‌రు కొట్టుకుంటేనే ప్రేమ ఉన్న‌ట్టా అంటూ ప్రశ్నించింది. అస‌లు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు.. ఇలాంటి ద‌ర్శ‌కుడు చేసే కామెంట్స్ వల్ల పిల్లలు కూడా అలాగే మారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతుంది చిన్మ‌యి.ఈమె చేసిన కామెంట్స్‌కు కొంద‌రు నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సినిమాలు చూసి ప్రేక్ష‌కులు కూడా అలాగే మారిపోతారంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. సినిమాల్లో ఉండే మంచిని తీసుకోన‌పుడు చెడును తీసుకుంటార‌ని ఎలా అనుకుంటారు అంటూ చిన్మ‌యిపై సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి క‌బీర్ సింగ్ ఓ వైపు 300 కోట్ల వైపు ప‌రుగులు తీస్తూనే మ‌రోవైపు కాంట్ర‌వ‌ర్సీల వెంట కూడా ప‌రుగు పెడుతుంది. మ‌రి ఇది ఎక్క‌డ ఎండ్ అవుతుందో చూడాలి.
First published: July 8, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading