chinmayi Sripada: న్యూడ్ ఫోటోస్ అడిగిన నెటిజన్‌... దానికి చిన్మయి రియాక్షన్ ఇది..

ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఇది బయటికి కనిపిస్తుంది.ఇక బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ప్రారంభించిన ఈ క్యాష్టింగ్ కౌచ్ ఉద్యమం సౌత్ ప్రముఖ గాయని చిన్మయి ముందుండి పోరాడుతోంది. తాజాగా చిన్మయికి ఒక నెటిజన్ ఆమె న్యూడ్ ఫోటోస్ పంపమని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోరితే.. దానికి చిన్మయి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

news18-telugu
Updated: May 21, 2019, 7:20 PM IST
chinmayi Sripada: న్యూడ్ ఫోటోస్ అడిగిన నెటిజన్‌... దానికి చిన్మయి రియాక్షన్ ఇది..
సినీ గాయకి చిన్మయి
news18-telugu
Updated: May 21, 2019, 7:20 PM IST
ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఇది బయటికి కనిపిస్తుంది.ఇక బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ప్రారంభించిన ఈ క్యాష్టింగ్ కౌచ్ ఉద్యమం సౌత్ ప్రముఖ గాయని చిన్మయి ముందుండి పోరాడుతోంది. అప్పట్లో ఓ స్కామ్‌లో ఇరుక్కుని న్యూడ్ వీడియోలు కూడా బయటికి రావడంతో చాలా ఇబ్బంది పడింది చిన్మయి. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు కూడా తాను ఎదుర్కొన్నానని చెప్పి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా లెజెండరీ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది ఈ గాయని. 18 ఏళ్ల వయసులో ప్రముఖ రచయిత వైరముత్తు తనకు లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా. తనకు జరిగిన సంఘటలపై నోరు విప్పినందుకు తనకు పని లేకుండా పోయిందని చెప్పింది. తాజాగా ఈ భామకు ఓ నెటిజన్.. ఆమె న్యూడ్ ఫోటోస్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని  చెప్పడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా  మారింది.





దానికి చిన్మయి రిప్లై ఇస్తూ  అతను తనను న్యూడ్ ఫోటో అడిగిన వర్డ్స్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు అతను అడిగిన దానికి కౌంటర్‌గా న్యూడ్ అనే బ్రాండ్ పేరుతో ఉన్న లిప్‌స్టిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చిన్మయి దెబ్బకు సదరు నెటిజన్..తన సోషల్ మీడియా అకౌంట్‌ను క్లోజ్ చేయడం కొసమెరుపు.



First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...