Bigg Boss : బిగ్‌బాస్‌కు కొత్త చిక్కులు.. కంటెస్టెంట్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం..
Big Boss Tamil : తమిళ బిగ్‌బాస్‌లో శనివారం నాటి ఎపిసోడ్లో శరవణన్ అనే కంటెస్టెంట్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు.
news18-telugu
Updated: July 29, 2019, 9:01 PM IST

సింగర్ శ్రీపాద చిన్మయి
- News18 Telugu
- Last Updated: July 29, 2019, 9:01 PM IST
తెలుగు బిగ్‌బాస్-3 ప్రారంభానికి ముందే ఎంత వివాదాన్ని రాజేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌ను కూడా వివాదాలు ముసురుకుంటున్నాయి. హీరో,మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ బిగ్‌బాస్ షోలో.. తాజాగా శరవణన్ అనే కంటెస్టెంట్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బస్సులో ప్రయాణికులు పడే ఇబ్బందుల గురించి కమల్ హాసన్ ఇంటి సభ్యులతో చర్చిస్తుండగా.. శరవణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'కిక్కిరిసిన బస్సులో ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో కొందరు త్వరగా ఆఫీసుకు చేరుకోవాలని బస్సు ఎక్కేవారైతే.. మహిళలను ఎక్కడెక్కడో టచ్ చేయడం కోసమే ఎక్కేవారు మరికొందరు' అని శరవణన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఒకప్పుడు తన కాలేజీ రోజుల్లో తానూ అలా చేసినవాడినే అని చెప్పుకొచ్చాడు.
శరవణన్ చేసిన ఈ వ్యాఖ్యలకు బిగ్‌బాస్ ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు వినిపించడం గమనార్హం. దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి.. తాను బస్సులో మహిళలను అసభ్యకరంగా తాకేవాడిని అని చెబుతుంటే.. అది ప్రేక్షకులకు వినోదం అనిపిస్తోందని ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.పైగా ఆ వ్యాఖ్యలు చేసిన అతన్ని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, మహిళలపై శరవణన్ చేసిన వ్యాఖ్యలను కమల్ హాసన్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అతను ఒకప్పుడు అలా హద్దులు దాటి ప్రవర్తించాడని, కానీ ఇప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడని చెప్పుకొచ్చారు. దాన్ని తప్పుపట్టిన చిన్మయి.. వేధింపులకు గురిచేసేవారిని ఇలా ప్రోత్సహించే సమాజంలో.. ఇక బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. మీటూ ఉద్యమం ద్వారా లైంగిక వేధింపులపై పోరాడిన చిన్మయి.. ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. చిన్మయి వ్యాఖ్యలకు అటువైపు నుంచి రియాక్షన్ ఏమైనా ఉంటుందా అన్నది వేచి చూడాలి.

రాహుల్ సిప్లిగంజ్ అభిమానులకు గుడ్ న్యూస్
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సవాల్ విసిరిన నటి భానుశ్రీ
పునర్నవిని తిట్టిపోస్తున్న రాహుల్ ఫ్యాన్స్
శ్రీముఖి క్రేజ్ ముందు రాహుల్ సిప్లిగంజ్ ఫసక్.. ఇదిగో సాక్ష్యం..
మా ఇంటిని కూల్చేసారు.. బిగ్ బాస్ 3 ఫేమ్ హిమజ ఎమోషనల్ వీడియో..
బిగ్ బాస్ పునర్నవి షాకింగ్ సీక్రెట్.. 16 ఏళ్ల వయసులోనే..
Loading...