Akhanda : చాలా రోజులు తరువాత విడుదలైన బాలకృష్ణ సినిమా అఖండ ఎంతటి హిట్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ అఖండ ఇండస్ట్రీ కూడా ఉహించని ఘన విజయం సాధించి అందరికి షాక్ ఇచ్చింది.
చాలా రోజులు తరువాత విడుదలైన బాలకృష్ణ (Balakrishna) సినిమా అఖండ (Akhanda) ఎంతటి హిట్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాస్తవానికి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన అఖండ ఇండస్ట్రీ కూడా ఉహించని హిట్ కొట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల పైనే కలెక్షన్ చేసినట్లు ఇండస్ట్రీ ట్రెండ్ వర్గాల టాక్. అఘోరాగా బాలకృష్ణ మెప్పించిన తీరు.. బోయపాటి.. బాలయ్యను చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కేవలం ఈ సినిమాను అభిమానులనే కాకుండా హిందుత్వవాదులు కూడా తెగ మెచ్చుకుంటున్నారు. హిందూ ధర్మం గురించి, దేవాలయాల ప్రాముఖ్యత గురించి కూడా చాలా అద్భుతంగా చూపించారని అంటున్నారు. తాజాగా ‘అఖండ’ సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ పంతులు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫస్ట్ టైమ్ ఆయన ఇలా ఓ సినిమాపై స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘పోయిన వారం నేను, నా స్వామివారి సేవక బృందంతో బోయపాటిగారి దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ సినిమా చూశాను. పోయిన వారమే ఈ సినిమా గురించి చెప్పాలని అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయా. కానీ ఇవాల్టి రోజు ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో అనే విషయాన్ని.. ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం మన అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. ‘అహింసా ప్రథమో ధర్మః’ అనే వ్యాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చు అనే సిద్దాంతాన్ని స్పష్టంగా చూపించడం జరిగింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి.
ఎందుకు ఇంతమంది ఈ సినిమాని చూస్తున్నారూ.. అంటే.. వారి మనసుల్లో ఈ ఉక్రోషం ఉంది. ఆక్రోషం ఉంది.. తపన ఉంది. ఏమీ చేయలేకపోతున్నామే.. అనే ఆందోళనకరమైనటువంటి కోపం ఉంది. రాజ్యాంగం ఉంది.. అయినా మన ధర్మానికి అన్యాయం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసమే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది పాలకులు గుర్తించాలి..’’ అని అన్నారు.
M.Balakrishna, News18, Hyderabad.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.