కాలచక్రం వేగంగా పరుగులు పెడుతోంది. చిన్నారులుగా మనం చూసిన వాళ్లంతా.. ఇప్పుడు మన గుర్తుపెట్టలేనంతగా ఎదిగిపోయారు. ఇక మనం గతంలో సినిమాల్లో చూసిన చిన్నారులు కూడా పెద్దవాళ్లయ్యారు. మన కళ్లముందున్నా వారిని గుర్తించలేని విధంగా ఎదిగిపోయారు. బాహుబలి తొలి భాగంలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి కాపాడుతుంది. ఆ చిన్నారి బ్రతకాలని దేవుడిని కోరుకుంటుంది. మహేంద్ర బాహుబలి బ్రతకాలి అంటూ తుది శ్వాస విడుస్తుంది. ఈ సీన్ బాహుబలికి ఓ హైలెట్.
రమ్యకృష్ణ ఈ సీన్లో పైకి ఎత్తుకున్న రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది. సినిమాలోని ఈ దృశ్యం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అద్భుతమే. ఇక ఈ సీన్లో కనిపించే చిన్నారి పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాప చాలా పెద్దదైంది.
ఇప్పుడిప్పుడే తన్వి స్కూల్కు కూడా వెళుతోంది. యూకేజీ చదువుతోంది. ఈ అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు చూసిన వాళ్లు.. చిన్నారి మెరుగైన భవిష్యత్తు ఉందని కొనియాడారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.