Home /News /movies /

Singer Sunitha: మీలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ సింగర్ సునీతకి షాక్ ఇచ్చాడు.. చివరికి అలా..?

Singer Sunitha: మీలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ సింగర్ సునీతకి షాక్ ఇచ్చాడు.. చివరికి అలా..?

Singer sunitha

Singer sunitha

Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే. తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది సునీత.. సింగర్ గా మంచి గుర్తింపు అందుకుంది.

    Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే. తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది సునీత.. సింగర్ గా మంచి గుర్తింపు అందుకుంది. ఎన్నో సినిమాలలో తన సంగీతాన్ని వినిపించింది. ఇక ఈమె కొన్ని రోజుల కిందట రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తెగ ముచ్చటిస్తుంది.

    తన రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది సునీత. ఇక ఈ మధ్య కోవిడ్ నేపథ్యంలో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతూ వారికి తన పాటలతో కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బుల్లితెర లో కూడ చేస్తుంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాం లో జడ్జ్ గా చేస్తుంది. తనతో పాటు నటి రేణు దేశాయ్, ఎస్ వి కృష్ణారెడ్డి కూడా జడ్జ్ గా చేస్తున్నారు. ఇదిలా ఉంటే సునీతకు ఓ బుడ్డోడు నీ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ షాక్ ఇచ్చాడు.

    ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది చిచ్చర పిడుగులు తమ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటారు. అన్ని రకాల నవరసాలను అందిస్తారు. అంతేకాకుండా వాళ్లు చేసే ఎమోషనల్ స్కిట్ లతో కూడా ప్రేక్షకులను, జడ్జీలను బాగా భావోద్వేగానికి గురి చేస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షో ప్రోమో విడుదల కాగా అందులో ఓ బుడ్డోడు మన్మథుడు సినిమాలో ఓ స్పూఫ్ తో స్కిట్ చేశాడు. ఇక అందులో ఎంతో ఫన్నీగా చేస్తూ నాగార్జున పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు. ఆ స్కిట్ తర్వాత సునీత ఆ బుడ్డోడిని నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలో అని ప్రశ్నించింది. వెంటనే ఆ బుడ్డోడు మీలా ఉండాలంటూ సునీత కి షాక్ ఇచ్చాడు. ఇక అక్కడున్నవారంతా నవ్వుకోగా.. రేణు దేశాయ్ ఆ బుడ్డోడితో ఓ డాన్స్ స్టెప్ వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Drama Juniors, Girl friend skit, Girlfriend, Singer Sunitha, Telugu, Tollywood, Zee telugu, డ్రామా జూనియర్స్, సింగర్ సునీత

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు