• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • CHILD ACTOR SHIVLEKH SINGH KILLED PARENTS INJURED IN CAR ACCIDENT NEAR RAIPUR MS

కారు ప్రమాదంలో బాల నటుడు మృతి.. తల్లి పరిస్థితి విషమం..

కారు ప్రమాదంలో బాల నటుడు మృతి.. తల్లి పరిస్థితి విషమం..

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ధర్విసా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు.

  • Share this:
    పలు హిందీ సీరియల్స్‌లో నటించిన బాల నటుడు శివలేఖ్ సింగ్(14) ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అతని తల్లి లేఖన,తండ్రి శివేంద్ర సింగ్, నవీన్ సింగ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ధర్విసా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వారు బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కి వెళ్తున్నట్టు సమాచారం.ధర్విసా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. ప్రస్తుతం శివలేఖ్ సింగ్ తల్లి లేఖన ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మీడియా ఇంటర్వ్యూ కోసమే శివలేఖ్ సింగ్ రాయ్‌పూర్ వెళ్తున్నట్టు అతని బంధువు ధీరేంద్ర కుమార్ శర్మ తెలిపారు.శివలేఖ్ సింగ్ స్వస్థలం ఛత్తీస్‌ఘడ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లా. అతని తల్లిదండ్రులు గత 10 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారు. 'సంకట్‌మోచన్ హనుమాన్' 'ససురాల్ సిమర్ కా' సహా పలు హిందీ సీరియల్స్‌, రియాలిటీ షోల్లో శివలేఖ్ నటించాడు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు