Home /News /movies /

CHIKATI GADILO CHITHAKOTUDU MOVIE COLLECTED HUGE AMOUNT AT BOX OFFICE GOING STRONG CR

బాక్సాఫీస్ దగ్గర ‘చితక్కొడుతున్న’ బూతు సినిమా... వివాదాల మధ్య వసూళ్ల వర్షం...

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ మూవీ పోస్టర్

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ మూవీ పోస్టర్

రెండు రోజుల్లోనే మంచి కలెక్షన్లు సాధించిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా...సక్సెస్ మీట్ పెట్టి మీడియాతో ఆనందం పంచుకున్న చిత్ర యూనిట్... సినిమాకు కలిసొస్తున్న వివాదాలు...

వివాదాలు సినిమా విజయాలకు కారణమవుతాయనేది టాలీవుడ్‌లో ఎప్పటినుంచో సూత్రం. రామ్‌గోపాల్ వర్మ ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడో గ్రహించి, తన సినిమాలను సాధ్యమైనంత వివాదాల్లో ఉంచేలా జాగ్రత్త పడతాడు. ఆయనకు ఈ ఫార్ములా పెద్దగా వర్కవుట్ కాకపోయినా... తాజాగా బూతు సీన్లతో వివాదాస్పదమైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ మాత్రం మంచి విజయం సాధించి, ఈ సూత్రాన్ని రుజువు చేసింది. కంప్లీట్ అండల్ట్ కామెడీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం... బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో విజయం దిశగా దూసుకుపోతోంది. ట్రైలర్ నుంచే పెను సంచలనం క్రియేట్ చేసింది ఈ సినిమా. బాలీవుడ్‌లో మాత్రమే కనిపించేంత బూతు సీన్లను ట్రైలర్‌లోనే చూపించి, తాము ఏం చూపించబోతున్నామో స్పష్టం చేశాడు డైరెక్టర్. యూత్‌ను మాత్రమే టార్గెట్ చేసి రూపొందించిన ఈ సినిమా పోస్టర్లపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజున థియేటర్ల దగ్గరికి వెళ్లి, పోస్టర్లు చించి హడావిడి చేశారు కొందరు. అయితే ఇవన్నీ ఈ సినిమాకు అదనపు ప్రమోషన్‌ను తెచ్చిపెట్టాయి.

అభ్యంతరం తెలిపేంత ఈ సినిమాలో ఏముందనే కుతుహలంతో సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు యువత. ఫలితంగా విడుదలైన మొదటి రోజే రూ.2.50 కోట్ల గ్రాస్ సాధించి రికార్డు క్రియేట్ చేసిందీ చిన్ని సినిమా. అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఇంత మొత్తం మొదటి రోజే రావడమంటే పెద్ద విషయమనే చెప్పాలి. జెనిలీయా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య అరుణ్, ఈ బూతు సినిమాలో హీరోగా నటించాడు. సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో మార్చి 21న విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
chikati gadilo chithakotudu movie collected huge amount at box office, going strong  బాక్సాఫీస్ దగ్గర చితక్కొడుతున్న బూతు సినిమా... వివాదాల మధ్య వసూళ్ల వర్షం...
ఈ సినిమాలో ఉన్న బూతు సీన్లు మరీ రెచ్చగొట్టేలా ఉన్నాయని యూత్ కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు.

విజయవాడలో కూడా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కోరుతూ మహిళా సంఘాలు డిమాండ్‌ను సెన్సార్ బోర్డు ముందుకు తీసుకొచ్చాయి. అయితే ఇప్పటికే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు నిషేధం విధించడం సాధ్యమయ్యే పని కాదు. ఇంటర్ పరీక్షలు కూడా పూర్తవ్వడం, యూత్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో ఈ సినిమా సక్సెస్ దిశగా దూసుకుపోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. సినిమాలో హీరోయిన్లుగా నటించిన నిక్కి తంబోల్, చంద్రికా రవి అందాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. నిజానికి వీరి అందాల ఆరబోతను వీక్షించేందుకే యూత్ థియేటర్లకు ఎగబడుతున్నారు. ఈ బూతు సినిమా విజయం కారణంగా మరిన్ని అడల్ట్ కామెడీ సినిమాలు రెచ్చిపోయి... వెండితెరపైకి దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ కూడా త్వరలోనే బాలీవుడ్‌లోలా అడల్డ్ కామెడీ సినిమాలతో నిండిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
First published:

Tags: Box Office Collections, Telugu Cinema, Telugu Movie, Telugu Movie News

తదుపరి వార్తలు