వెండితెరపై మూడు భాగాలుగా ఛత్రపతి శివాజీ జీవితం.. హీరో ఎవరంటే..

Chhatrapati Shivaji Maharaj Biopic | మరాఠా యోధుడు అఖండ హిందూ సామ్రాజ్యాధినేతగా పేరు గడించి.. అప్పటి మొఘల్ పాలకుడు ఔరంగజేబును గడగడలాడించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 20, 2020, 8:17 AM IST
వెండితెరపై మూడు భాగాలుగా ఛత్రపతి శివాజీ జీవితం.. హీరో ఎవరంటే..
‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ జీవితంపై సినిమా (File/Photo)
  • Share this:
మరాఠా యోధుడు అఖండ హిందూ సామ్రాజ్యాధినేతగా పేరు గడించి.. అప్పటి మొఘల్ పాలకుడు ఔరంగజేబును గడగడలాడించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. నిన్న ఆ మహనీయుడు జయంతి సందర్భంగా శివాజీ జీవిత కథ ఆధారంగా మూడు భాగాలుగా సినిమాను ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. ఈ చిత్రాన్ని మరాఠీ చిత్రం ‘సైరత్’ ఫేమ్ నాగరాజ్ మంజులే ఈ భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి ‘శివాజీ’ అని.. రెండో భాగానికి ‘రాజా శివాజీ’ మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో  ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే యేడాది ఈ చిత్రం మూడు భాగాలు.. కొన్ని నెలల గ్యాప్‌తో విడుదల కానుట్టు ప్రకటించారు.

chhatrapati shivaji maharaj biopic announced riteish deshmukh to play shivaji charecter,Chhatrapati Shivaji Maharaj,Chatrapati Shivaji Maharaj,shivaji maharaj biopic,Chhatrapati Shivaji Maharaj biopic,riteish deshmukh as Chhatrapati Shivaji Maharaj,riteish deshmukh as shivaji maharaj charecter,riteish deshmukh twitter.riteish deshmukh instagram,riteish deshmukh facebook,sairat fame nagrjaj manjule,bollywood,hindi cinema,tanhaji,ఛత్రపతి,ఛత్రపతి శివాజీ మహారాజ్,ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రితేష్ దేశ్‌ముఖ్,ఛత్రపతి శివాజీగా రితేష్ దేశ్‌ముఖ్,రితేష్ దేశ్‌ముఖ్
‘ఛత్రపతి శివాజీ’ మహారాజ్ పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్ (Twitter/Photo)


ఈ సినిమాను శివాజీ జయంతి సందర్భంగా ప్రకటించడం సంతోషంగా ఉందని చిత్ర బృందం ప్రకటిచింది. ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ జీవితం పై భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పూర్తి స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ఆయన జీవితంపై పలు సీరియల్స్‌ తెరకెక్కాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. హిందీలో ‘తానాజీ’ వంటి కొన్ని సినిమాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రకు ప్రాధాన్యం ఉన్నా..పూర్తి స్థాయిలో మాత్రం శివాజీ సినిమాను తెరకెక్కించలేకపోయారు . తెలుగులో కూడా అక్కినేని హీరోగా నటించిన ‘భక్త తుకారాం’ వంటి సినిమాల్లో శివాజీ పాత్ర మనకు కనబడుతోంది. మొత్తానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంపై రితేష్ దేశ్‌ముఖ్ సినిమా ప్రకటించడాన్ని ఛత్రపతి శివాజీ ఆరాధించే ప్రేక్షకులు, అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు