భారతీయుడు 2 దుర్ఘటనపై కమల్ హాసన్‌ను విచారించిన పోలీసులు..

భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. తాజాగా ఈ ఘటనపై చెన్నై పోలీసులు హీరో కమల్ హాసన్‌ను ఎగ్మోర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో కొన్ని గంటల పాటు విచారించారు.

news18-telugu
Updated: March 3, 2020, 4:12 PM IST
భారతీయుడు 2 దుర్ఘటనపై కమల్ హాసన్‌ను విచారించిన పోలీసులు..
పోలీసుల ఎదుట విచారణకు హాజరైన కమల్ హాసన్ (Twitter/Photo)
  • Share this:
భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటనలో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ దుర్ఘటపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే  ఈ ప్రమాద ఘటన జరిగిందనే దానిపై చెన్నై పోలీసులు ‘భారతీయుడు 2’ చిత్ర యూనిట్‌పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే లైకా ప్రొడక్షన్‌కు సంబంధించిన వాళ్లతో పాటు చిత్ర దర్శకుడు శంకర్‌‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిచి ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారిస్తున్నారు. తాజాగా చెన్నై పోలీసులు ‘భారతీయుడు 2’ హీరోగా నటిస్తున్న కమల్ హాసన్‌ను పిలిచి ఈ ఘటనపై ఆయన్ని ప్రశ్నించారు. కమల్ హాసన్.. మాత్రం పోలీసులు తనను ఘటనకు సంబంధించిన విషయాలను అడిగినట్టు చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాద ఘటనలో కృష్ణ (34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60), శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (28) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 3, 2020, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading