CHENNAI COURT GETS VERY ANGRY OVER DHANUSH AND ASKED FOR HIS BIRTH CERTIFICATE PK
ధనుష్‌కు కోర్టు షాక్.. నీ బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ అంటూ ఆగ్రహం..
ధనుష్ (File Photo)
Dhanush: వరస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్. నార్త్‌లోనూ ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈయన రీల్ లైఫ్ ఎలా..
వరస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్. నార్త్‌లోనూ ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈయన రీల్ లైఫ్ ఎలా ఉన్నా కూడా రియల్ లైఫ్‌పై మాత్రం చాలా సస్పెన్స్ సాగుతుంది. ఈయన అసలు కస్తూరి రాజా కొడుకు కాదంటూ మూడేళ్లుగా ఓ కేసు కోర్టులో ఉంది. ధనుష్ నిజజీవితంపై ఇప్పుడు ఎక్కడలేని సస్పెన్స్ డ్రామా జరుగుతుంది. తాజాగా ఈ విషయంలో కోర్టు కూడా ధనుష్‌కు షాక్ ఇచ్చింది. ధనుష్ తమ కొడుకే అని.. చిన్నతనంలో తిడితే ఇల్లు వదిలేసి పారిపోయాడని మధురైలో ఉండే కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించారు. నాలుగేళ్లుగా ఈ కేసు నడుస్తూనే ఉంది.
ధనుష్‌పై సీరియస్ అయిన కోర్టు (Court serious on Dhanush)
కొన్నిసార్లు ధనుష్‌కు వ్యతిరేకంగా.. మరికొన్నిసార్లు ఆయనకు పాజిటివ్‌గా చాలా మలుపులు తిరుగుతుంది ఈ కేసు. ఇన్ని రోజులు ఈ కేసు విషయంలో బాగా నాన్చిన మదురై కోర్టు ఒక్కసారిగా ధనుష్‌కి సూపర్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు జరిగిన విచారణలో ధనుష్ జనన, విద్య, ఇంటికి సంబందించిన ఒరిజినల్ సర్టిపికెట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. ఇవి వెంటనే కోర్టుకు సబ్మిట్ చేయాలని కోరింది. అసలెందుకు ఇవి కోర్టుకు తీసుకురాలేదు.. బర్త్ సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అతడికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు న్యాయస్థానంలో పొందుపరచాలని చెన్నై కార్పోరేషన్‌ను ఆదేశించింది.
ధనుష్‌పై సీరియస్ అయిన కోర్టు (Court serious on Dhanush)
మరోవైపు తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ.. అసలు తామెవరో తెలియదని చెబుతుంటే భరించలేకపోతున్నామని కదిరేశన్ దంపతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డీఎన్ఏ చేయిస్తే అసలు నిజం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపారు. గతంలో ధనుష్ పుట్టుమచ్చులు కూడా చెరిపించుకున్నాడనే వ్యవహారం సంచలనంగా మారింది. తన నటన కోసమే అలా చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కోర్టు కోపానికి గురయ్యాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు నిజంగా ధనుష్.. కస్తూరి రాజా కొడుకా లేదంటే కదిరేషన్ దంపతులు చెబుతున్నదే నిజమా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.