హోమ్ /వార్తలు /సినిమా /

Cheddi Gang Tamasha: ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ మూవీ ..

Cheddi Gang Tamasha: ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ మూవీ ..

ఈ నెల 10న ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’ మూవీ  విడుదల (Twitter/Photo)

ఈ నెల 10న ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’ మూవీ విడుదల (Twitter/Photo)

Cheddi Gang Tamasha: వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. బ్రహ్మానందం చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాను ఈ నెల 10న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Cheddi Gang Tamasha: అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందిఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తిన్నాము. సినిమా బాగా వచ్చింది..అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీలో ఉన్నాయి. తప్పకుండా ఆకట్టుకుంటుంది టైటిల్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్, టీజర్ ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్ ను హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

టీజర్ ట్రైలర్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. మా తోలి ప్రయత్నం ను ఆశీర్వదించండి అని అన్నారు.

నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. సినీ నిర్మాత అనేవాడు రైతు లాంటి వాడు. మా డబ్బులతో మీకు వినోదాన్ని ఇచ్చే టందుకు కృషి చేస్తాము. మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికి నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్ 2 కూడా ఉంటుంది. అన్నీ కుదిరితే పార్టీ 2 లో బ్రహ్మానందం గారు కూడా నటిస్తారన్నారు. పద్మ శ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా హీరోగా ఈ చెడ్డి గ్యాంగ్ తో ఎంతో కష్టపడి అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు అని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఒక సినిమాని తియ్యడానికి నానా ఇబ్బంది పడుతున్న ఈ టైం లో ఇతను ఈ చెడ్డి గ్యాంగ్ తో సినిమా తీశాడు. ట్రైలర్ చాలా సహజంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కోసం మాస్టర్ జి లాంటి వారితో పాటలు రాయించికొని ఈ కుర్రాళ్లు అందరూ చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. సినిమా బాగుంటే అదే సక్సెస్ అవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు.

హీరో; వెంకట్ కళ్యాణ్

హీరోయిన్: గాయత్రి పటేల్

డి ఓ పి: జి కె యాదవ్ బంక

సంగీతం: అర్జున్

లిరిక్స్: విహారి

ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్

ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ

కొరియోగ్రాఫర్ : భాను.

నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్

స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు