CHECK MOVIE REVIEW NITHIIN CHANDRASEKHAR YELETI MARK MOVIE TA
Check Movie Review: నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. యేలేటీ మార్క్ సినిమా..
నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ (Twitter/Photo)
Check Movie Review | దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటేనే కొత్తదనంతో కూడిన సినిమాలనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఈయన తాజాగా నితిన్‌తో ‘చెక్’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్‌గా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటేనే కొత్తదనంతో కూడిన సినిమాలనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఈయన తాజాగా నితిన్‌తో ‘చెక్’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్‌గా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
స్టోరీ విషయానికొస్తే.. ఆదిత్య (నితిన్) టెర్రరిజం కేసులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ. ఈ జైలులో తన సహచర ఖైదీగా చెస్‌లో ప్రావీణ్యం ఉన్న మరో వ్యక్తి (సాయి చంద్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో ఉరి శిక్ష పడ్డ ఖైదీ ఎలా చెస్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. అసలు ఆదిత్యకు ఉరిశిక్ష ఎందుకు పడింది. అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? చివరకు ఆదిత్య ఉరిశిక్ష నుంచి బయటపడ్డాడా లేదా అనేదే ‘చెక్’ సినిమా స్టోరీ.
కథనం..
కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో మనం చూడడానికి వెళ్తాం. చంద్ర శేఖర్ యేలేటి సినిమాలను కూడా ఎలా ఉన్న చూడ్డానికి వెళ్లే ప్రేక్షకులున్నారు. అలా యేలేటి తన స్క్రీన్ ప్లేతో మరోసారి ‘చెక్’ సినిమాతో మరోసారి మాయ చేసాడు. చిన్న పాయింట్ చుట్టు తన కథను పకడ్బందీగా అల్లుకున్నాడు. అక్కడక్కడ తడబడ్డ ఓవరాల్‌గా పర్వాలేదనిపిస్తోంది. మనందరికి తెలిసిన చెక్ సినిమాను తనదైన స్క్రీన్ ప్లేతో మలిచాడు. హీరోను ఉరిశిక్ష పడ్డ ఖైదీగా పరిచయం చేయడం... అక్కడ నుంచి కథను నడిపించడం బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సెంకడాఫ్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెంచాడు. అక్కడక్కడ ట్విస్టులున్న ఊహించినంతగా లేవు. పూర్తి స్క్రీన్ ప్లే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా కథ విషయంలో యేలేటి కాస్త తడిబడినట్టు కనబడుతుంది. ఉన్న కథనే చాలా ఫర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు యేలేటి.
కథలో ఎక్కడ అనవసర పాటలు, కామెడీ జోలికి పోకుండా సీరియస్‌గా ఈ సినిమాను మలిచాడు. నెమ్మదిగా సాగినా.. ఎక్కడ బోర్ కొట్టించే అనవసరం అనిపంచే సన్నివేశాలు మాత్రము లేవు. క్లైమాక్స్ వరకు హీరోను టెర్రరిజం ముద్ర పోతుందా అనే ధ్యాసలో వెళ్లకుండా.. ఆడియన్స్‌ను చెస్ గేమ్‌తోనే చెక్ పెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి. మొత్తంగా మరోసారి ‘చెక్’ మూవీతో తన మార్క్ చూపించాడు. చంద్రశేఖర్ యేలేటి ప్రతీసారి కథ, కథనం బలంగా రాసుకునేవాడు.. కానీ ఈ సారి కథనం కాస్త స్లో అయింది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో నితిన్ తన గత సినిమాల్లో కంటే చాలా బాగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో రాణించాడు. రకుల్ ఉన్నంతలో పర్లేదనపించింది. ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ కే పరిమితం అయింది. ప్రియా ప్రకాష్ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఓవరాల్‌గా చెక్.. యేలేటి మార్క్ ముందులా కనిపించని సినిమా..