Home /News /movies /

CHEATING CASE FILED AGAINST RAM GOPAL VARMA SB

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు షాక్.. చీటింగ్ కేసు నమోదు

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడని పోలీసుల్ని ఆశ్రయించాడు.

    వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. తాజాగా వర్మపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు.

    ఇదే విషయంపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. దిశ సినిమా నిర్మించేదుకు గాను 56 లక్షలు తీసుకున్న వర్మ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆయన వర్మపై  ఫిర్యాదు చేశాడు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 406, 417, 420, 506 సెక్షన్ల కింద వర్మపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

    శేఖర్‌ రాజుకు .. కొన్నాళ్ల క్రితం రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్‌ గోపాల్‌ వర్మతో తనకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను వర్మకి జనవరి 2020లో ₹ 8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో ₹ 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. ఈ మొత్తాన్ని వర్మ ‘ఆశ’ సినిమా విడుదలకు ముందే తనకి తిరిగి ఇస్తానని హామి ఇచ్చినట్లు తెలిపారు. అయితే వర్మ చెప్పిన సమయం దాటిపోవడం, పైగా ఆ చిత్రానికి వర్మ నిర్మాత కాదని రాజుకు తెలియడంతో అతను మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.

    వివరాల్లోకి వెళ్తే రాంగోపాల్ వర్మ సమర్పణలో విడుదలైన చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్'. ఈ సినిమా యదార్థ ఘటన ఆధారంగా రూపొందించారన్న విషయం తెలిసిందే. నవంబర్, 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన.. నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అప్పట్లో ఈ సినిమా చూట్టు వివాదాలు చుట్టుముట్టడంతో పలుమార్లు చిత్రం విడుదల కాకుండా వాయిదా పడుతూ వచ్చినా, చివరికి ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Cheating case, Disha, Police Case, Ram Gopal Varma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు