HOME »NEWS »MOVIE »cheating case against tollywood young hero viswant in hyderabad ak

Tollywood: టాలీవుడ్ యువ హీరోపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..

Tollywood: టాలీవుడ్ యువ హీరోపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..
విశ్వంత్ ( Image: Youtube)

Tollywood: తక్కువ ధరకు కార్లను ఇప్పిస్తానంటూ కొందరు దగ్గర విశ్వంత్ డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

  • Share this:
    టాలీవుడ్ యువ హీరో విశ్వంత్‌పై ఛీటింగ్ కేసు నమోదైంది. తక్కువ ధరకు కార్లను ఇప్పిస్తానంటూ కొందరు దగ్గర విశ్వంత్ డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో వారంతా పోలీసులు ఆశ్రయించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు విశ్వంత్‌పై కేసు నమోదు చేశారు. విస్వంత్ నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో సెకండ్ హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు విశ్వంత్. విశ్వంత్ పూర్తి పేరు విశ్వనాథ్. కాకినాడలోని సామర్లకోటలో పుట్టిన విశ్వంత్.. పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నారు. ఇంటర్ హైదరాబాద్‌లో చదివిన విశ్వంత్.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూరులో పూర్తి చేశారు.

    ఆ తరువాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విశ్వంత్‌కు దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా.. విశ్వంత్‌కు మాత్రం అంతో ఇంతో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తరువాత మోహన్ లాల్, గౌతమి నటించిన మనమంతా సినిమాలోనూ విశ్వంత్ నటించారు. ఈమధ్య కాలంలో వచ్చిన 'ఓ పిట్టకథ'తో పాటు పలు వెబ్ సిరీస్‌లోనూ విశ్వంత్ నటించాడు.

    Published by:Kishore Akkaladevi
    First published:January 19, 2021, 22:39 IST

    टॉप स्टोरीज