ఈ సమాజంలో తండ్రి పాత్ర వెలకట్టలేనిది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మొదటి హీరో ఎవరంటే ఆ వ్యక్తి తండ్రి మాత్రమే. ఇలా సగర్వంగా చెప్పుకునే వారు ఎంతోమంది ఉన్నారు. అన్ని విషయాల్లో కుటుంబానికి వెన్నంటి ఉంటూ అండగా నిలబడే వ్యక్తి నాన్న. ప్రతి క్షణం తన కుటుంబం కోసం ఆలోచిస్తూ కుటుంబ ఉన్నతి కోసం పాటుపడుతూ అలుపెరగని పోరాటం చేస్తుంటారు నాన్న. అలాంటి నాన్న గొప్పతనాన్ని వివరిస్తూ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఓ ఆడియో రిలీజ్ చేశారు. పూరి మ్యూజింగ్స్‌లో (Puri Musings) భాగంగా ఆయన రీలీజ్ చేసిన ఈ ఆడియో ఫైల్ ఆలోచింపజేసే పదాలతో ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతోంది. ఇందులోని ఒక్కో పదం వింటుంటే నాన్న కష్టం, నాన్న ఆలోచనలు కళ్ల ముందు కదలాడుతున్నాయి.
''నాన్న మనకోసం ఎం చేశాడో మనకు తెలియదు.. ఎన్ని కష్టాలు పడ్డాడో కూడా తెలియదు ఎందుకంటే నాన్న ఎప్పుడూ మనకు ఆ విషయాలు చెప్పడు. ఎవరికీ చెప్పడు.. పిల్లలకు, పెళ్ళానికి అస్సలు చెప్పడు. అమ్మలా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడం నాన్నకు రాదు. రాత్రియంబవళ్ళు పనిపై శ్రద్ద పెడుతూ రాత్రి ఎప్పుడో ఇంటికొచ్చి మంచంపై ఎదుగుతున్న పిల్లలను చూసి మురిసిపోతాడు. ఎప్పుడూ పనేనా.. కాస్త ఫ్యామిలీకి టైం కేటాయించొచ్చుగా అని అమ్మ పెట్టె చిరాకు భరిస్తూనే ఉంటాడు. పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతూ ఉంటారు. కానీ నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతాడు. అనుక్షణం పెళ్ళాం బిడ్డల కోసమే కష్టపడతాడు'' పూరి చెబుతున్న మాటలు ప్రతి ఒక్క కుటుంబానికి కనెక్ట్ అవుతున్నాయి.
అయితే ఈ ఆడియో ఫైల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన ఛార్మి (Charmy Kaur).. ఇందులోని ప్రతి మాట నిజం అంటూ ట్యాగ్ చేసింది. దీంతో ఈ ఆడియో ఫైల్ నెట్టింట వైరల్ అయింది. పూరి చెప్పిన మాటలు అక్షరాలా వాస్తవం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. నిన్న (జూన్ 19) ఫాదర్స్ డే (Fathers Day) సందర్భంగా ఈ ఆడియో ఫైల్ పంచుకుంది ఛార్మి.
View this post on Instagram
ప్రస్తుతం పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ అయిన పూరి కనెక్ట్స్ (Puri Connects) పూర్తి బాధ్యతలు చూసుకుంటోంది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ పట్టేసిన ఈ కాంబో ప్రస్తుతం లైగర్ (Liger) సినిమా తెరకెక్కిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Charmy Kaur, Fathers Day, Puri Jagannadh