కెరీర్ ప్రారంభం నుండి ఛార్మికి డాన్సర్ గా మంచి గుర్తింపే ఉంది. ఎటువంటి భేషజం లేకుండా.... ట్యూన్స్ కు తగ్గట్టు నర్తించడం ఈ హాట్ గర్ల్ కు అలవాటే. ఆమె డాన్స్ కు అభిమానులు చాలామందే వున్నారు. అయితే .. తన డ్యాన్స్‌తో ఓ కుర్రాడు ఛార్మి మనసు దోచేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఛార్మి. అంతేకాకుండా ఆ కుర్రాడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది ఈ భామ. ఇటీవల ఆమె నిర్మాణంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఈ అమ్మడు దూకుడు మాములుగా లేదు. ఈ చిత్రంలోని 'సిలక.. సిలక..' అంటూ సాగే ఓ మాస్ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాటకు శ్రీకాంత్ అనే కుర్రాడు డ్యాన్స్ చేసిన వీడియోను అతని స్నేహితుడు ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మిలను ట్యాగ్ చేశాడు. తాజాగా ఆ వీడియోను చూసిన ఛార్మి అతని డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. దీంతో శ్రీకాంత్ స్నేహితుడు పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఆ కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.
Amaaaaaaazing man ... soooo charmingly energetic.. wish I was there to dance with u 😃😃😃 https://t.co/ZYBusz5oeF
— Charmme Kaur (@Charmmeofficial) November 28, 2019
‘శ్రీకాంత్ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావ్. నీలో ఎంతో ఎనర్జీ ఉంది. ఒకవేళ నేను అక్కడ ఉండి ఉంటే నీతో కలిసి డ్యాన్స్ చేసేదాన్ని’ అని ఛార్మి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Charmme kaur, Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda