Charmme Kaur: కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చార్మి తల్లిదండ్రులు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

టాలీవుడ నటి, నిర్మాత చార్మి తల్లిదండ్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చార్మి ఆదివారం రోజున ట్విటర్ వేదికగా వెల్లడించింది.

news18-telugu
Updated: October 26, 2020, 3:20 PM IST
Charmme Kaur: కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చార్మి తల్లిదండ్రులు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..
చార్మి కౌర్ (Charmi kaur)
  • Share this:
టాలీవుడ నటి, నిర్మాత చార్మి తల్లిదండ్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చార్మి ఆదివారం రోజున ట్విటర్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వారి ఆరోగ్య పరిస్థితిపై చార్మి ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రులు చికిత్స‌కు స్పందిస్తున్నారని.. వారికి డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపింది. "ఏఐజీ హాస్పిటల్ అద్భుతమైన వైద్య బృందం.. నా పెరేంట్స్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నా తల్లిదండ్రులను నవ్వు ముఖాలతో చూడటం చాలా బాగుంది" అని పేర్కొంది. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిదండ్రులకు సంబంధించిన ఫొటోలను కూడా చార్మి షేర్ చేసింది.

ఇక, తన తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డ విషయాన్ని వెల్లడించిన చార్మి ట్విటర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది. "అక్టోబర్ 22న నా తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారు. ఇది చాలా దురద‌ష్టకరం. హైదరాబాద్‌లో ఇంట్లో ఉంటున్న వాళ్లు.. మార్చి నుంచి కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు. వారికి వారే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇటీవల వచ్చిన హైదరాబాద్ వరదలు, ఇతర పరిస్థితుల వల్ల వారికి కరోనా సోకింది. ఇంతకుముందు మా నాన్నకు ఉన్న ఆరోగ్య సమస్యలు తెలిసిన వ్యక్తిగా.. ఈ విషయం నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కరోనా సోకిన వెంటనే వారిని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించాం. అక్కడ నాకు చాలా కాలంగా తెలిసిన డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వారికి చికిత్స అందిస్తున్నారు.

అక్కడ వైద్య బృందం నా తల్లిదండ్రులను చాలా కేరింగ్‌గా చూసుకుంటున్నారు. నా పెరేంట్స్ కూడా చికిత్సకు స్పందిస్తున్నారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న చికిత్సకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అనుభవం తర్వాత నేను మీకు ఒకటే సలహా ఇస్తున్నాను. మీకు ఏవైనా కరోనా లక్షణాలుంటే దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి.. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ముందుగానే కరోనా సోకినట్టు గుర్తించగలిగితే.. చాలా వరకు నష్టం కలగకుండా నివారించవచ్చు. నా తల్లిదండ్రులను తిరిగి ఆరోగ్యంగా చూసేందుకు ఎంతో ఆతృతతో ఉన్నాను. ఆ దుర్గా మాత మిమ్మల్ని చెడు నుంచి రక్షించి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా తల్లిదండ్రుల త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని కోరుతున్నాను" అని చార్మి పేర్కొంది.


ఇక, తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వచ్చిన చార్మి.. ఇప్పుడు నిర్మాతగా సెటిల్ అయిపోయింది ఛార్మి కౌర్. ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగమ్మాయిలా కలిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా నిర్మిస్తుంది ఛార్మి.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading