ఒకప్పడు హీరోయిన్గా తన అందచందాలతో అలరించిన ఛార్మి.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తోంది. ఆమె నిర్మాణంలో ఆ మధ్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకుడు. ప్రస్తుతం ఛార్మి విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తోంది. ఫైటర్ పేరుతో వస్తోన్న ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకుడు. కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా పడిన ఈ చిత్రం చిత్రీకరణను త్వరలో పున: ప్రారంభించనుంది. అది అలా ఉంటే ఛార్మీ తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకుంది. ఈ ఫొటోలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉండడంతో ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో గురించి చార్మీ ట్వీట్ చేస్తూ.. 'తన 9 నెలల వయసున్న పెంపుడు కుక్కతో ప్రభాస్' అంటూ ట్వీటింది. ఆ ఫోటోలో ప్రభాస్ ఓ విశాలమైన సోఫాలో కూర్చుని... చార్మీ పెంచుకుంటున్న అలాస్కన్ మలాముటే జాతికి చెందిన కుక్కతో రాజసం ఒలకబోయడం ప్రస్తుతం అందర్ని ఆకర్షిస్తోంది. ఇక ప్రభాస్, ఛార్మి గతంలో కలిసి చక్రం, పౌర్ణమి సినిమాల్లో కలిసి నటించారు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మొన్నటి వరకు ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. ఇటీవలే టీమ్ హైదరాబాద్ చేరుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్.. ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్లో సడలింపులు ఇవ్వడంతో మళ్లీ ప్రారంభించింది.
సాహో సినిమా తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ఇది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. రాధే శ్యామ్ సినిమాను కూడా రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా నటిస్తున్నట్టు పోస్టర్లో రివీల్ చేసారు. ప్రభాస్ బర్త్ డే ఇటీవల సందర్భంగా ఓ పాటతో కూడిన మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా చేస్తున్నాడు. ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.