• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • CHANNELS ASKED TO AIR APOLOGY TO RAKUL PREET IN DRUGS CASE MHN

apology to Rakul Preet In Drugs Case: మీడియాకు ర‌కుల్ ప్రీత్ షాక్‌.. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలంటూ ఆదేశాలు

apology to Rakul Preet In Drugs Case: మీడియాకు ర‌కుల్ ప్రీత్ షాక్‌.. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలంటూ ఆదేశాలు

రకుల్ ప్రీత్ Photo : Twitter

Rakul Preet Singh - Drugs Case: మీడియాకు ర‌కుల్ ప్రీత్ షాక్‌.. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలంటూ ఆదేశాలు

  • Share this:
    టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌.. అటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన హీరోయ‌న్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌టి. ఈ అమ్మ‌డు నేష‌న‌ల్ మీడియాకే పెద్ద షాకిచ్చింది. డ్ర‌గ్ కేసులో ఓవ‌ర్గం మీడియా త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుందంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విచార‌ణ చేసిన న్యూస్ బ్రాడ్ క్రాస్టింగ్ అథారిటీ.. ర‌కుల్‌కు మ‌ద్దుతుగా.. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నే ఆదేశాలు వెలువ‌రిచింది. అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని ఓసారి త‌ర‌చిచూస్తే..పంజాబీ గుడియా ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. 2020 పెద్ద త‌ల‌నొప్పినే క్రియేట్ చేసింది. ఎందుకంటే, అర‌కొర సినిమాలే ఉన్నా, సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ బిజీ బిజీగా మారిపోయిందీ ముద్దుగుమ్మ‌. స‌రేలే! అవ‌కాశాలదేముందిలే అని అనుకుంటున్న స‌మయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య.. ర‌కుల్‌కు లేనిపోని స‌మ‌స్య‌ల‌ను క్రియేట్ చేసింది. కేసుని సీబీఐ విచారించే స‌మ‌యంలో డ్ర‌గ్స్ కోణం వెలుగులోకి రావ‌డంతో నార్కోటిక్ విభాగం రంగంలోకి దిగింది. సుశాంత్ ల‌వ‌ర్ రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా ఆమె సోద‌రుడిని, మ‌రికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    బాలీవుడ్‌లో మొద‌లైన డ్ర‌గ్స్ కేసు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు చేరి అటు నుండి టాలీవుడ్‌ను కూడా కుదిపేసింది. ఆ స‌మ‌యంలో రియా చ‌క్ర‌వ‌ర్తితో ర‌కుల్ చాట్ చేసిన‌ట్లు వార్త‌లు హ‌ల్‌చల్ చేసిన నేప‌థ్యంలో నార్కోటిక్ అధికారులు ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను ప్ర‌శ్నించారంటూ జాతీయ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. మీడియాలో ఓ వ‌ర్గం త‌న‌ను త‌ప్పుగా చూపిస్తుంద‌ని, కేసు పూర్త‌య్యే వ‌ర‌కు త‌న పేరుని మీడియా ప్ర‌స్తావించ‌కుండా నియంత్రించాలంటూ కోర్టు మెట్లెక్కింది. దీనిపై న్యూస్ బ్రాడ్‌కాస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విచార‌ణ చేసి కొన్ని ఛానెల్స్ ర‌కుల్ పేరుని ప్ర‌స్తావిస్తూ వార్త‌లు ప్ర‌సారించార‌ని, కాబట్టి స‌ద‌రు ఛానెల్స్‌ ర‌కుల్‌కు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతూ డిసెంబ‌ర్ 17న వార్త‌ల‌ను ప్ర‌సారం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌సారం చేసిన విష‌యాన్ని లిఖిత పూర్వ‌కంగా నివేదిక పంపాల‌ని కూడా సూచ‌న‌లు చేసింది. మ‌రి మీడియా ఈ విష‌యాన్ని ఎంత సీరియ‌స్‌గా తీసుకుంటుంది.. వ్య‌వ‌హారం ఎంత ముందుకు వెళుతుంతో చూడాలి.

    ర‌కుల్ విష‌యంలో నేష‌న‌ల్ మీడియాకు ఇది ఊహించ‌ని షాకేన‌ని చెప్పొచ్చు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. వైష్ణ‌వ్‌తేజ్ సినిమాతో పాటు భార‌తీయుడు 2లో, ఓ బాలీవుడ్ మూవీలోనూ ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు