బాబు,వైయస్ఆర్‌ల పొలిటికల్ నేపథ్యంలో దేవాకట్ట ‘ఇంద్రప్రస్థం’ సినిమా..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమాలకు సంబంధించిన పరిశ్రమల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా దర్శకుడు దేవా కట్ట చంద్రబాబు, వైయస్ఆర్ జీవిత కథకు ఫిక్షన్ జోడించి ‘ఇంద్రప్రస్థం’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసాడు.

news18-telugu
Updated: August 14, 2020, 3:50 PM IST
బాబు,వైయస్ఆర్‌ల పొలిటికల్ నేపథ్యంలో దేవాకట్ట ‘ఇంద్రప్రస్థం’ సినిమా..
దేవా కట్ట ‘ఇంద్రప్రస్థం’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమాలకు సంబంధించిన పరిశ్రమల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే తెలుగులో పలు బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పటికే ఎన్టీఆర్, వైయస్ఆర్, నరేంద్ర మోదీ జీవిత కథలతో  సినిమాలు తెరకెక్కాయి. ఇపుడు జయలలిత జీవిత కథ నేపథ్యంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి నాలుగైదు సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా దేవా కట్ట మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి స్నేహం, పొలిటికల్ వైరం నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ఆ సినిమాకు ‘ఇంద్రప్రస్థం’ అనే టైటిల్ పెట్టడమే కాకుండా.. థీమ్ పోస్టర్‌‌ను రిలీజ్ చేసాడు. ఈ థీమ్ పోస్టర్‌లో చంద్రబాబు, వైయస్ఆర్‌ను నీడలను పోలీ ఉన్నాయి. ఈ చిత్రాన్ని పూర్తిగా ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చంద్రబాబు, వైయస్ఆర్ మూడు దశాబ్దాల పొలిటికల్ ప్రయాణం. ఈ మజిలీలో వీరి మధ్య స్నేహం ఎలా వైరంగా మారిందనేదే ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇద్దరు స్నేహితులు ఓ పోటీలో పాల్గొన్నపుడు అది ఎలా ఆసక్తికర మలుపు తిరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రూడోస్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై హ‌ర్ష‌.వి, తేజ‌.సి ఈ చిత్రాన్నిసంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం దేవాక‌ట్ట సాయితేజ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తైయిన తర్వాత ‘ఇంద్రప్రస్థం’ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా థీమ్ పోస్టర్‌తో దేవా కట్ట ఈ చిత్రంపై అంచనాలు పెంచేసాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 14, 2020, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading