హోమ్ /వార్తలు /సినిమా /

‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను చూసిన చంద్రబాబు..ఇంతకీ ఏమన్నారంటే..

‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను చూసిన చంద్రబాబు..ఇంతకీ ఏమన్నారంటే..

ఎన్టీఆర్ బయోపిక్‌ను వీక్షించిన చంద్రబాబు

ఎన్టీఆర్ బయోపిక్‌ను వీక్షించిన చంద్రబాబు

మహానటుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఆయన తనయుడు బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మించిని సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఈ బుధవారం విడులైన ఈసినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, సహా పలువురు మంత్రులు టీడీపీ నేతలతో కలిసి ఈ సినిమాను వీక్షించారు.

ఇంకా చదవండి ...

మహానటుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఆయన తనయుడు బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మించిని సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఈ బుధవారం విడులైన ఈసినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.


మరోవైపు ఈ బయోపిక్‌లో బాలకృష్ణ..తన తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు. ఒకటి రెండు సన్నివేశాలు తప్పిస్తే మొత్తంగా తన తండ్రిని తన నటనతో మరిపించాడు. మరోవైపు ఈసినిమాను చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ‘ఎన్టీఆర్’ బయోపిక్‌పై ప్రశంసలు ఝల్లులు కురిపిస్తున్నారు.


ఈ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, సహా పలువురు మంత్రులు టీడీపీ నేతలతో కలిసి ఈ సినిమాను వీక్షించారు.


అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘ఎన్టీఆర్’ సినిమా అద్బుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత తనకు  పాత రోజులను గుర్తుకొచ్చాయన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఇందులో చూపించారన్నారు. ఈ సినిమా అందరికీ స్ఫూర్తి నిస్తుందని కొనియాడారు. ప్రతి ఒక్క తెలుగువాడు ఈసినిమా తప్పక చూడాలన్నారు. క్రిష్ టేకింగ్..మిగతా నటీనటుల నటనతో పాటు బాలయ్య తన మామయ్య ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని మెచ్చుకున్నారు. ఈ బయోపిక్‌లో తన క్యారెక్టర్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ..నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు అంటూ విలేఖరులకు కౌంటర్ వేసారు.


ఇవి కూడా చదవండి


NTR Kathanayakudu Movie Review: ఎన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ


‘మ‌హానాయ‌కుడు’ ఎలా ఉండ‌బోతుంది.. వివాదాలుంటాయా.. ఉండవా..?

First published:

Tags: Bala Krishna Nandamuri, Chandrababu naidu, Krish, NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు