సీక్రెట్స్ చెప్పేసిన చమ్మక్ చంద్ర... అదీ అసలు విషయం...

జబర్దస్త్, అదిరింది షోల్లో ఫ్యామిలీ స్కిట్లతో అందర్నీ ఆకట్టుకునే చమ్మక్ చంద్ర... ఆ స్కిట్ల వెనక ఆసక్తికర విషయాల్ని మీడియాతో పంచుకున్నాడు. అవేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 10, 2020, 2:15 PM IST
సీక్రెట్స్ చెప్పేసిన చమ్మక్ చంద్ర... అదీ అసలు విషయం...
సీక్రెట్స్ చెప్పేసిన చమ్మక్ చంద్ర... (credit - YT - Zee Telugu)
  • Share this:
మొన్నటిదాకా జబర్దస్త్ కామెడీ షో, ఇప్పుడు అదిరింది కామెడీ షోలో కిర్రాక్ కామెడీతో ఇరగదీస్తున్నాడు చమ్మక్ చంద్ర. సంసారం ఓ సాగరం... అనే కాన్సెప్ట్‌తో... ఫ్యామిలీ స్కిట్స్ చేస్తూ... కోట్ల మంది ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తనవైపు తిప్పుకున్నాడు చమ్మక్ చంద్ర. ముగ్గురు అన్నదమ్ముల్లో చంద్ర పెద్దవాడు. అతని తండ్రిది తెలంగాణ... కామారెడ్డి జిల్లాలోని వెంకటాపురం తండా. చిన్నప్పటి నుంచే సినిమాలు చూస్తూ... సినిమా ప్రపంచాన్నే ఊహించుకుంటూ పెరిగిన చంద్ర... ఊళ్లో... మెగాస్టార్ చిరంజీవి పాటలకు స్టెప్స్ వేస్తూ పెరిగాడు. టెన్త్ తర్వాత హైదరాబాద్ వచ్చిన చమ్మక్ చంద్ర... రూ.2 వేలతో ఓ యాక్టింగ్ స్కూల్లో చేరి... ట్రైనింగ్ తీసుకున్నాడు. దర్శకుడు తేజా సినిమా జైలో... తొలిసారి వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో చేశాడు. తాజాగా 50వ సినిమాగా వెంకీమామలో సందడి చేశాడు.

2013లో జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాక... ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు చమ్మక్ చంద్ర. ప్రతీ స్కిట్‌కీ తనే సొంతంగా స్క్రిప్ట్, డైలాగ్స్ రాసుకునే చంద్ర... ఫ్యామిలీ స్కిట్లు బాగా చెయ్యడానికి గల కారణాల్ని వివరించాడు. ప్రతీ స్కిట్టూ రాయడానికి చంద్ర... దాదాపు రెండు, మూడు రోజులు తీసుకుంటున్నాడు. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి... షూటింగ్ జరుపుతున్నాడు. ప్రతీ స్కిట్‌లోనూ ఓపెనింగ్ సాంగ్, ఇంట్రడక్షన్, మిడిల్ డ్రామా, ఎండింగ్ డ్రామా కింద మూడు పార్టులుగా విభజించుకుంటున్నాడు.

చిన్నప్పటి నుంచీ పల్లెటూరిలో జరిగే భార్యాభర్తల గొడవలు, వాళ్ల కష్టసుఖాలు చూస్తూ పెరిగిన చమ్మక్ చంద్ర... వాటినే తన స్కిట్లలో ప్రయోగిస్తున్నా్డు. ఐతే... ప్రతీ స్కిట్‌లో కామెడీ పండేలా జాగ్రత్త పడుతున్నాడు. 2011లో పద్మావతిని పెళ్లిచేసుకున్న చంద్రకు ఇద్దరు అబ్బాయిలు. తన గుండె, కళ్లను... మోహన్ ఫౌండేషన్‌కి దానం చేసిన చమ్మక్ చంద్ర... బతికినంతకాలం... కమెడియన్‌గానే నవ్వులు పూయిస్తానంటున్నాడు. గ్రేట్ కదా.

First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు