జబర్దస్త్ కామెడీ షో గుట్టు విప్పిన చమ్మక్ చంద్ర...

జబర్దస్త్ కామెడీ షో వేదిక‌గా చేసుకొని ఇప్పుడు ఎంతోమంది సినీ ప‌రిశ్ర‌మ‌లోకి  వచ్చారు. అందులో చమక్ చంద్ర కూడా ఒకరు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామ జపమే చేస్తున్నారు కొంత మంది ఆడియన్స్. తాజాగా జబర్దస్త్ కామెడీ షో గుట్టు విప్పాడు.

news18-telugu
Updated: January 23, 2020, 3:03 PM IST
జబర్దస్త్ కామెడీ షో గుట్టు విప్పిన చమ్మక్ చంద్ర...
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో వేదిక‌గా చేసుకొని ఇప్పుడు ఎంతోమంది సినీ ప‌రిశ్ర‌మ‌లోకి  వచ్చారు. అందులో చమక్ చంద్ర కూడా ఒకరు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామ జపమే చేస్తున్నారు కొంత మంది ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో ఆయనతో పాటే ఇప్పుడు జీ తెలుగుకు వచ్చాడు చంద్ర. ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నచంద్ర... ఆడ వేషంతో ప్రేక్షకులకు ప్రతి స్కిట్టుకూ కొత్త స్టైల్స్ ను చూపిస్తూ పాపులర్ అయ్యాడు. అంతేకాదు ‘అరవింద సమేత’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘రాజా ది గ్రేట్’, ‘టాక్సీవాలా’, ‘వెంకీ మామ’ వంటి సినిమాల్లో కూడా హాస్యాన్ని పండించారు. ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి ‘అదిరింది’ అనే షోతో టీం లీడర్ గా కొనసాగుతున్న చంద్ర .. జబర్ధస్త్ షోకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు వెల్లడించారు.

Tollywood News,Telugu Cinema,Telugu Movie,Telugu Cinema News,Tollywood Movie News,breaking news,తెలుగు వార్తలు,తెలుగు న్యూస్,బ్రేకింగ్ న్యూస్,వైరల్ న్యూస్,
సీక్రెట్స్ చెప్పేసిన చమ్మక్ చంద్ర... (credit - YT - Zee Telugu)


జబర్దస్త్ షో లో అందరి కంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని చంద్ర స్పష్టం చేశాడు. అంతేకాదు, ఒక్కో టీమ్‌కు ఒక్కోలా రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పాడు. అలాగే, ఇవి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ పారితోషకాన్ని పెంచుతారని తెలిపాడు. ఇక, ఆర్టిస్టుల విషయానికి వస్తే తమ తమ టీమ్‌లలో చేసే వారికి ప్రాధాన్యతను బట్టి చార్జ్ డిసైడ్ చేస్తామని చమ్మక్ చంద్ర పేర్కొన్నాడు. జబర్దస్త్ షోలో ఎన్నో స్కిట్లతో అలరించిన చమ్మక్ చంద్ర కొద్ది రోజులు జబర్ధస్త్‌కు బ్రేక్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే వెల్లడించాడు.ఇదిలావుంటే జబర్దస్త్ కామెడీ షోలో చంద్ర లేకపోవడంతో ఆ లోటు భర్తీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 23, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading