పేర్లు మార్చుకున్న బుల్లితెర కామెడీ స్టార్స్..

ఆదివారం ప్రసారమైన అదిరింది మూడో ఎపిసోడ్‌లో టీమ్ పేర్లను జడ్జిలు నాగబాబు, నవదీప్ ప్రకటించారు. ధన్‌రాజ్ టీమ్‌ను ధన్‌రాజ్ బ్లాస్టర్స్, ఆర్పీ టీమ్‌ను ఆర్పీ రైడర్స్, చంద్ర టీమ్‌ను చంద్ర ఛాలెంజర్స్, వేణు టీమ్‌ను వేణు వారియర్స్‌గా పేర్కొన్నారు.

news18-telugu
Updated: January 6, 2020, 5:19 PM IST
పేర్లు మార్చుకున్న బుల్లితెర కామెడీ స్టార్స్..
చంద్ర, ధన్‌రాజ్, వేణు
  • Share this:
జబర్దస్త్‌కు పోటీగా వచ్చిన అదిరింది కామెడీ షో ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. జబర్దస్త్‌ను ఢీకొట్టడమే లక్ష్యంగా ఎపిసోడ్ ఎపిసోడ్‌కు ఇంప్రూవ్ అవుతోంది. ఈ షోకు బుల్లితెర బ్యూటీ సమీరా షెరిఫ్ యాంకర్‌గా.. నాగబాబు, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ధన్ రాజ్, ఆర్పీ, చంద్ర, వేణు టీమ్ లీడర్స్‌గా ఉన్నారు. ఐతే జబర్దస్త్‌లో ఉన్న సమయంలో వీరి పేర్లు ధనాధన్ ధన్‌రాజ్, కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర, వండర్స్ వేణుగా ఉండేవి. వీరంతా ఆ షోను వదిలేసి 'అదిరింది' షోకు రావడంతో పేర్లు కూడా మారిపోయాయి.

ఆదివారం ప్రసారమైన అదిరింది మూడో ఎపిసోడ్‌లో టీమ్ పేర్లను జడ్జిలు నాగబాబు, నవదీప్ ప్రకటించారు. ధన్‌రాజ్ టీమ్‌ను ధన్‌రాజ్ బ్లాస్టర్స్, ఆర్పీ టీమ్‌ను ఆర్పీ రైడర్స్, చంద్ర టీమ్‌ను చంద్ర ఛాలెంజర్స్, వేణు టీమ్‌ను వేణు వారియర్స్‌గా పేర్కొన్నారు. గతంలో ధనాధన్ ధన్‌రాజ్, కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర, వండర్స్ వేణుగా ఉండేవారు. వాస్తవానికి ఈ పేర్లతోనే వారు చాలా ఫేమస్ అయిపోయారు. ఆ పేర్లే వీరికి ఇంటిపేర్లుగా మారిపోయాయి. వాటితో పిలిస్తేనే జనాలకు కూడా అర్థమవుతుంది. కానీ ఛానెల్ మారడంతో ఇప్పుడా పేర్లు మారిపోయాయి.

ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర టీమ్ పేరు.. చంద్ర ఛాలెంజర్స్‌గా మారిపోయింది. బుల్లి తెరపై ఫ్యామిలీ స్కిట్స్‌తో నవ్వులు పూయిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు చంద్ర. చమ్మక్ చంద్రగా అందరికీ సుపరిచితుడయ్యాడు. మనోడి స్కిట్స్ అన్ని ఫ్యామిలీస్‌కి కనెక్ట్ అవుతాయి. అందుకే చంద్ర స్కిట్స్‌కు యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. ఇప్పుడు చంద్ర ఛాలెంజర్స్‌గా ఎంట్రీ ఇచ్చిన చంద్రకు.. ఈ కొత్త పేరు మరింత మంచి పేరు తీసుకొస్తాయో లేదో చూడాలి.
Published by: Shiva Kumar Addula
First published: January 6, 2020, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading