Chalapathi Rao Death: చలపతిరావు.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు కొన్ని దశాబ్దాలుగా పరిచయం. వందల సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసిన నటుడు చలపతి రావు నాలుగు రోజుల క్రితం 24/12/2022న శనివారం అర్ధరాత్రి తన స్వగృహంలో కన్నుమూసారు. అయితే ఈయన కుమార్తెలు విదేశాల్లో ఉండటంతో మహా ప్రస్థానంలోని ఫీజర్‌లో ఆయన మృత దేహాన్ని భద్రపరిచారు. నిన్న చలపతి రావు కుమార్తెలు విదేశాల నుంచి రావడంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో చలపతి రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చలపతి రావు కుమారుడు రవిబాబు.. చలపతి రావు కు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి పరుచూరి గోపాలకృష్ణ, హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, దర్వకుడు బోయపాటి శ్రీను, శ్రీవాస్‌తో పాటు పలువురు నటీనటులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ నెల 24న శనివారం రాత్రి చలపతి రావు గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన 1200 పైగా చిత్రాల్లో నటించారు. ఈయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. నిన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చలపతి రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే కదా. చలపతిరావు నటించిన మొదటి సినిమా గూఢాచారి 116, చివరిగా నాగార్జున మూవీ బంగర్రాజులో కనిపించారు ఈయన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మనిషిగా పేరు సంపాదించుకున్నారు.
తెలుగులో చలపతిరావు అంటే రేప్ సీన్స్ స్పెషలిస్ట్ అనే పేరు గడించారయన. సినిమాలో రేప్ సీన్ ఉందంటే చాలు ఆయన్నే పిలిచే వాళ్లు దర్శక నిర్మాతలు. అలాంటి పేరు సంపాదించుకున్నాడు ఈయన. ఆడాళ్ళు ఆయన్ని చూసి ఆమడదూరం పారిపోయే వాళ్లు. సినిమాల్లోనే తాను విలన్ అని చెప్పినా కూడా వినిపించుకునే వాళ్లు కాదు. ఎందుకంటే ఏ సినిమాలో చూసినా రేప్ సీన్ చేసేవాడు. ప్రతీ సినిమాకు కామన్ పాయింట్ కావడంతో రేప్స్ రావు అనే వాళ్లు ఆయన్ని. గతంలో చాలా సినిమాలు అత్యాచారాల చుట్టూనే తిరిగేవి. సినిమాలో తమ భార్యనో.. చెల్లినో రేప్ చేస్తే వాళ్లపై హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే మెయిన్ పాయింట్‌గా కథగా అల్లుకునే వారు. అలాంటి సినిమాలే తెలుగులో చాలా వచ్చాయి. అలాంటి రేప్ సీన్స్‌లో చలపతిరావు నటించేవారు.
దీనికి తోడు ఒకప్పుడు రేప్ సీన్లు లేని సినిమాలే ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో రేప్ సీన్ ఉందంటే వెంటనే దర్శక నిర్మాతలకు చలపతిరావునే గుర్తొచ్చేవాడు. అందుకే తన కెరీర్‌లో ఆయన ఏకంగా 94 రేప్ సీన్లలో పాల్గొని చరిత్ర సృష్టించారు. తన 50 ఏళ్లకు పైగా సినీ కెరీర్‌లో దాదాపు 1200 సినిమాలు చేసిన ఈయనకు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం రేప్ సీన్సే. ఈ విషయం ఆయన కూడా ఒప్పుకున్నారు.
కేవలం 22 ఏళ్ల వయసులోనే కృష్ణ హీరోగా నటించిన ‘గూఢచారి 116’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసారు. ఎన్నో కష్టాలు పడి.. ఎన్టీఆర్ దగ్గరికి చేరాడు. అక్కడ్నుంచి తన కెరీర్‌లో ఎన్టీఆర్ ఎన్నోసార్లు సాయం చేసాడని చెప్పారు ఈ దివంగత నటుడు. మరోవైపు సీనియర్ నటులు సత్యనారాయణ, రావుగోపాలరావు విలన్స్‌గా నటించిన సినిమాల్లో కూడా రేప్ సీన్ అంటే.. ‘మన చలపాయ్ ఉన్నాడుగా.. రేప్ సీన్స్ ఆయనే బాగా చేయగలడు’ అని వాళ్ళు నవ్వుతూ చెప్పేవాళ్లని ఇండస్ట్రీలో చెప్తుంటారు. కెరీర్ మొత్తంలో మెయిన్ విలన్ కంటే విలన్ కింద మెయిన్ రౌడీ పాత్రలోనే ఎక్కువగా నటించారు చలపతి రావు. ఇక దాన వీర శూర కర్ణలో అన్న ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తే.. చలపతి రావు ఈ సినిమాలో కర్ణుడి తండ్రి పాత్ర సూతుడుగాను.. ఇంద్రుడిగాను.. జరాసందుడితో పాటు మరో రెండు పాత్రలో నటంచారు. ఏదేమైనా కూడా మొదట్లో అలాంటి పాత్రలు చేసినా ఆ తర్వాత మాత్రం మెల్లగా విలన్‌తో పాటు కమెడియన్, బాబాయ్ పాత్రలతో మెప్పించాడు. ఏది ఏమైనా పెద్ద వాల్లకు చలపాయ్ గాను.. చిన్నవాళ్లకు చలపాయ్ బాబాయిగా ఇండస్ట్రీలో అందరికీ దగ్గరయ్యారు. ముఖ్యంగా నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో ఈయన కెరీర్ సరికొత్త టర్న్ తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chalapathi Rao, Tollywood