పటాస్‌ షోలో అదిరిపోయిన చలాకీ చంటి ఎంట్రీ...యాంకర్ వర్షిణి తట్టుకోలేక...

టైమింగ్ లోనూ, పంచులు విసరడంలో చంటి మామూలు మనిషి కాదు. మరి మొదటి నుంచి పేలవమైన ప్రదర్శన ఇస్తున్న వర్షిణి చంటి ముందు నిలబడుతుందా, పెట్టే బేడా సర్దేస్తుందా అని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: December 9, 2019, 10:17 PM IST
పటాస్‌ షోలో అదిరిపోయిన చలాకీ చంటి ఎంట్రీ...యాంకర్ వర్షిణి తట్టుకోలేక...
పటాస్‌ షోలో అదిరిపోయిన చలాకీ చంటి ఎంట్రీ...యాంకర్ వర్షిణి తట్టుకోలేక... (Image: Youtube)
  • Share this:
పటాస్ షోలో యాంకర్ రవి ఔట్ అయ్యాక అదే ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చిన చలాకీ చంటి అదరగొట్టే స్టైల్ లో రంగప్రవేశం చేసేశాడు. పేరులోనే చలాకీతనం ఉన్న చంటికి పటాస్ లాంటి షోలో ఎలా రెచ్చిపోవాలో బట్టర్ తో పెట్టిన విద్య అనే చెప్పొచ్చు. యాంకర్ రవి, లాస్య తో ప్రారంభమైన పటాస్ షో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. లాస్య ఔట్ కావడంతో ఆ ప్లేస్ లోకి వచ్చిన శ్రీముఖి మరింత రెచ్చిపోయింది. అంతేకాదు శ్రీముఖి కెరీర్ ఈ రోజు ఒక స్టార్ స్టేటస్ చేరేందుకు పటాస్ ఏ కారణమని చెప్పొచ్చు. బిగ్ బాస్ కారణంగా అటు శ్రీముఖి కూడా ఔట్ కావడంతో పటాస్ లోకి వర్షిణి ప్రవేశించింది. అయితే ఇప్పుడు మొదటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్న యాంకర్ రవి సైతం పటాస్ నుంచి ఎగ్జిట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం చలాకీ చంటి పటాస్ యాంకర్ అవతారం ఎత్తేశాడు. అయితే చలాకీ చంటి ఎనర్జీ ముందు యాంకర్ వర్షిణి ఎలా తట్టుకుంటుందా అనే సందేహం ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది.

ఎందుకంటే టైమింగ్ లోనూ, పంచులు విసరడంలో చంటి మామూలు మనిషి కాదు. మరి మొదటి నుంచి పేలవమైన ప్రదర్శన ఇస్తున్న వర్షిణి చంటి ముందు నిలబడుతుందా, పెట్టే బేడా సర్దేస్తుందా అని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి ఎపిసోడ్ లో అయితే చంటి కాస్త తగ్గి కనిపిస్తున్నప్పటికీ, వర్షిణి మాత్రం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది.First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>