• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • CHADWICK BOSEMAN STAR OF BLACK PANTHER AND AVENGERS DIES OF COLON CANCER AT AGE OF 43 TA

Chadwick Boseman: హాలీవుడ్ నటుడు అవెంజర్స్ ఫేమ్ చాడ్విక్ బోస్‌మెన్ కన్నుమూత..

Chadwick Boseman: హాలీవుడ్ నటుడు అవెంజర్స్ ఫేమ్ చాడ్విక్ బోస్‌మెన్ కన్నుమూత..

అవెంజర్స్ నటుడు చాడ్విక్ బోస్‌మెన్ కన్నమూత (Photo/News18 English)

Chadwick Boseman Passes Away | హాలీవుడ్‌ బ్లాక్ బస్టర్స్ అవెంజర్స్‌, బ్లాంక్ పాంథర్ వంటి పలు సినిమాల్లో నటించిన హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మెన్ శుక్ర వారం కాన్సర్‌తో కన్నమూశారు.

  • Share this:
    Chadwick Boseman Passes Away |  హాలీవుడ్‌ బ్లాక్ బస్టర్స్ అవెంజర్స్‌, బ్లాంక్ పాంథర్ వంటి పలు సినిమాల్లో నటించిన హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మెన్ శుక్ర వారం కాన్సర్‌తో కన్నమూశారు. ఆయన వయసు 43 యేళ్లు. గత నాలుగేళ్లుగా ఈయన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని తన స్వగృహంలో కన్నుమూసారు. చనిపోయేటపుడు ఆయన భార్య కుటుంబ సభ్యులు దగ్గర ఉన్నారు. ఈయన గత కొన్నేళ్లుగా పెద్ద ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే ఆయన పలు సినిమాల్లో నటించారు.ముఖ్యంగా కెప్టెన్ అమెరికా సివిల్ వార్ చిత్రంలో బ్లాక్ పాంథర్ పాత్ర చాడ్విక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అదే పాత్రను ఆయన  అవెంజర్స్‌లో పోషించడం విశేషం.  నల్ల జాతీయుడైన తొలి సూపర్ హీరోగా చాడ్విక్ హాలీవుడ్‌ ప్రేక్షకుల గుండెల్లో కొలువై ఉన్నాడు. ఆయన మృతికి హాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులతో పాటు దర్శకులు, నిర్మాతలు నివాళులు అర్పిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు